రోడ్డుపై డబ్బులు దొరకడం మంచిదేనా?

by Dishanational2 |
రోడ్డుపై డబ్బులు దొరకడం మంచిదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపై డబ్బులు కనిపించడం. కానీ ఎప్పుడూ కాకుండా ఏదో ఒక్కసారి డబ్బులు కనిపిస్తుంటాయి.కొందరికి నాణాలు కనిపిస్తే మరికొందరికి నోట్లు కనిపిస్తుంటాయి. అయితే రోడ్డుపై డబ్బులు దొరకడం కొందరు మంచిదంటే, మరికొందరు మంచిది కాదు అంటారు. అయితే నిజంగానే రోడ్డుపై డబ్బులు దొరకడం మంచిదో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూడటం చాలా శుభప్రదం అంట. రోడ్డుపై పడి ఉన్న నాణెం క‌నిపిస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందంట. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే, మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారట. ఇక ఏదైనా పని ముగించి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో డబ్బు కనిపిస్తే, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయంట. ఏదైనా ముఖ్యమైన పనికోసం బయటకు వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నాణెం దొరికితే మీరు చేయబోయే పనిలో విజయం సాధిస్తారని అర్థం అంట.

Also Read..

కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు తెలుసా..? వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?


Next Story

Most Viewed