ఎంజాయ్‌మెంట్ కాదు.. ఫిట్‌నెస్ ముఖ్యం.. Gen Z‌లో మారుతున్న ధోరణి!

by Javid Pasha |

జెన్ Z ఇప్పుడు సరికొత్తగా ఆలోచిస్తోంది. ‘వీకెండ్’ లో పార్టీలు, పబ్బులు, నైట్ అవుట్‌ల కంటే ఫిట్‌నెస్ ముఖ్యమని భావిస్తోంది.

ఎంజాయ్‌మెంట్ కాదు.. ఫిట్‌నెస్ ముఖ్యం.. Gen Z‌లో మారుతున్న ధోరణి!
X

దిశ, ఫీచర్స్ : ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వీకెండ్స్‌లో పబ్బులు, పార్టీలు, ట్రిప్పులంటూ ఎంజాయ్ చేయాలన్న ఆలోచన యువతలో ఎక్కువగా ఉంటుంది. కానీ అదంతా ఒకప్పుడు. ఈతరం యూత్‌లో అలాంటి థాట్స్ మారుతున్నాయని ‘గాలబ్ అండ్ ‘మానిటరింగ్ ది ఫ్యూచర్’ నిర్వహించిన అధ్యయనాలు పేర్కొ్ంటున్నాయి. ప్రస్తుతం తమ ఫ్రీటైమ్‌ను ఎలా స్పెండ్ చేయాలనే విషయాల్లో జెన్‌జీ(Gen Z) కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నది. ‘డ్రింక్స్‌’కు బదులు ‘ప్రోటీన్ షేక్స్’, ‘నైట్ అవుట్’లకు బదులు ‘మార్నింగ్ రన్’లకు ప్రయాటీ ఇస్తున్నది.

జెన్ Z (1997–2012 మధ్య జన్మించినవారు) ఇప్పుడు సరికొత్తగా ఆలోచిస్తోంది. ‘వీకెండ్’ అంటే పార్టీలు, పబ్బులు, ఆల్కహాల్‌ తాగుతూ లేట్‌నైట్ వరకు ఎంజాయ్ చేయడాలు ఇప్పుడు చాలామందికి నచ్చడం లేదు. ఇటువంటి వాటికంటే హెల్తీ రొటీన్‌లు, ఫిట్‌నెస్‌, మానసిక శ్రేయస్సునే ప్రాధాన్యంగా పెట్టుకుంటోందని సర్వేలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఆల్కహాల్ వినియోగం తగ్గుతోంది. మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ అయిన ఇప్సోస్ సర్వే ప్రకారం.. 18–34 ఏండ్ల మధ్య వయసుగల వారిలో సగం మంది అంటే.. 50% యువత ‘ఇకపై తక్కువ తాగుతాను’ అని ప్లాన్ చేసుకుంటున్నది. అదే సమయంలో జెన్ Z పాత తరాలకంటే కూడా ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న జనరేషన్‌గా మారుతోంది.

ఏబీసీ(ABC) ఫిట్‌నెస్ డేటా ప్రకారం 73 శాతం మంది జెన్ Z యువకులు జిమ్, యోగా లేదా హెల్త్ క్లబ్‌కి రెగ్యులర్‌గా వెళ్తున్నారు. మరొక సర్వే ప్రకారం కూడా.. 57 శాతం మంది యువత ఒక గంట బార్‌లో గడపడం కంటే, జిమ్‌లో వర్కౌట్ చేయడాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నది. ఈ మార్పు కేవలం ఫ్యాషన్ లేదా ట్రెండ్ మాత్రమే కాదని, జీవితాన్ని, జీవన శైలిని పూర్తిగా మార్చేసే సరికొత్త మార్గమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల సోషల్ మీడియా ఒత్తిడికి, ఆర్థిక ఒత్తిడికి, ఆల్క హాల్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై ఫోకస్ చేయడంతో ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. Link

Next Story