ఇన్‌స్టా‌గ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి ప్రైవసీ లేదు!

by Javid Pasha |   (  Updated:2026-05-08 12:12:20  IST  )

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇక నుంచి ఆ విషయంలో ప్రైవసీ లేదని తెలిపింది.

ఇన్‌స్టా‌గ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి ప్రైవసీ లేదు!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఇన్‌స్టా‌గ్రామ్‌లో చాటింగ్ చేస్తారా? సీక్రెట్ విషయాలు పంచుకునేటప్పుడు జర జాగ్రత్త అయితే! ఇక నుంచి మీరు చేసే చాటింగ్ లేదా మెసేజ్‌లకు ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఎందుకంటే.. మే 8, 2026 (శుక్రవారం) నుంచి మెటా సంస్థ ఈ యాప్‌లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇకపై ఎటువంటి న్యూ ఎన్‌క్రిప్టెడ్ చాట్స్ సపోర్ట్ కూడా ఉండదని తెలిపింది. ఇప్పటికే ఉన్న ఎన్‌క్రిప్టెడ్ చాట్స్ కూడా సాధారణ చాట్స్‌గా మారుతాయి. దీంతో మెటా లేదా హ్యాకర్స్ ఎవరైనా సరే.. మీరు ఇన్‌స్టా యాప్ ద్వారా చేసే చాటింగ్‌లను చదవడం లేదా స్కాన్ చేయడం, హ్యాక్ చేయడం పెద్ద పనేం కాదు.

నిజానికి ఇన్‌స్టాగ్రామ్ (మెటా) 2023లో డైరెక్ట్ మెసేజెస్‌(DMs)లో ఆప్షనల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్‌ను ఆన్‌చేసి చాట్ చేస్తే దానిని సెండర్, రిసీవర్ తప్ప ఇంకెవరూ చదవకుండా ఫుల్ ప్రైవసీ ఉండె. అంటే.. మీ చాటింగ్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు. మెటా కంపెనీ ఉద్యోగులు కూడా చదవలేరు. ఇది అడిషనల్ ప్రైవసీ ప్రొటెక్షన్‌గా పనిచేసేది. కానీ ఇప్పుడా పరిస్థితిలేకుండా పోయింది. మరి దీనిని ఎందుకు తొలగిస్తున్నారంటే.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్ ఆప్షన్‌ను చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ ఆప్షన్ అవసరం లేదని మెటా భావిస్తోంది. ఇప్పటికే చాటింగ్ లిస్టులో ఏవైనా సీక్రెట్ మెసేజెస్, మీడియా లింకులు ఉంటే డౌన్‌లోడ్ చేసుకొని, అందులో డిలీట్ చేసి, యాప్ అప్‌డేట్ చేసి, ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మెటా తెలిపింది.

బిగ్ షాకిచ్చిన అషురెడ్డి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ పూర్తి.. వైరల్ అవుతున్న ఫొటోలు

Next Story