- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ షాకిచ్చిన అషురెడ్డి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ పూర్తి.. వైరల్ అవుతున్న ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. అయితే ఈసారి ఆమె పంచుకున్న ఫొటోలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా పెద్ద సంచలనంగా మారాయి. తాజాగా అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు అనిపించే కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. అషురెడ్డి ప్రస్తుతం ఒక భారీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి సుమారు రూ. 9.5 కోట్లు వసూలు చేసి, మోసం చేసిందంటూ ఒక ఎన్‌ఆర్‌ఐ (NRI) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు నడుస్తుండగానే ఆమె తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
నిజమేనా.. లేక షూటింగా?..
అషురెడ్డి పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె సాంప్రదాయబద్ధంగా ముస్తాబై ఉండటం చూస్తుంటే నిశ్చితార్థం నిజమేనని కొందరు భావిస్తున్నారు. అయితే.. ఇది ఏదైనా కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన షూటింగా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఫోటోలపై అషురెడ్డి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఆమె నిజంగానే ఓ ఇంటిది కాబోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుంటే, మరికొందరు మాత్రం "కేసు నడుస్తుండగానే ఈ ఊహించని షాక్ ఏంటి?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






