పిల్లలును పర్యావరణ ప్రేమికులుగా మార్చే.. ఇన్నోవేటివ్ యాప్స్.!

by Daayi Srishailam |

ఫోన్‌లో ఉండే కొన్ని యాప్స్ ద్వారానే వారి మైండ్ సెట్‌ను డైవర్ట్ చేయడమొక్కటే పరిష్కారం.

పిల్లలును పర్యావరణ ప్రేమికులుగా మార్చే.. ఇన్నోవేటివ్ యాప్స్.!
X

స్మార్ట్‌ఫోన్లకు పిల్లలు బానిసలవుతున్నారు.

"ఫోన్ వద్దు" అని చెప్తే..

"తిండి వద్దు పో" అని మారాం చేస్తున్నారు.

"ఫోన్" నుంచి పిల్లలను దూరం చేయడానికి..

తల ప్రాణం తోకకొస్తుంటుంది కొందరికి.

ఫోన్‌లో ఉండే కొన్ని యాప్స్ ద్వారానే వారి మైండ్ సెట్‌ను డైవర్ట్ చేయడమొక్కటే పరిష్కారం.

- దిశ, ఫీచర్స్

స్క్రోల్ చేస్తూ చేస్తూ అలసిపోతున్నారు పిల్లలు. వాళ్లకేం కావాలో.. ఏది చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫోన్ చేతిలో పట్టుకొని.. కళ్లలో నీళ్లు పేరుకొని.. ఇంకేదో కొత్త వాటికోసం వెతుకుతూనే ఉంటారు. ఆ వెతికేదేదో ప్రకృతికి సంబంధించిందే ఎందుకు కాకూడదు.? సాంకేతికతను ఉపయోగించి పిల్లలను పర్యావరణ ప్రేమికులుగా ఎలా మార్చాలో తెలిపే కొన్ని యాప్స్ ఉన్నాయి.

జీవ వైవిధ్య పరిరక్షణ

యాప్స్ ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అని అంటున్నారు నిపుణులు. పర్యావరణంతో లోతైన బంధాన్ని ఆ యాప్స్ ప్రేరేపిస్తాయని సూచిస్తున్నారు. ఈ ఆధునిక అనువర్తనాలతో పిల్లలను ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షకులుగా మార్చవచ్చు. పరిరక్షణ వాదులుగా తయారుచేయవచ్చు. ప్రకృతి అన్వేషణను ఆసక్తికరంగా, ప్రభావవంతంగా చేయొచ్చు. మొక్కలు, జంతువులు, కీటకాలను నమోదు చేయడానికి వీలు కల్పించొచ్చు. ఈ యాప్స్ పాఠశాల విద్యను మించి.. పిల్లలకు ప్రకృతిని అర్థం చేసుకునే.. ఇంకా దానిని కాపాడే బాధ్యతను నేర్పే గొప్ప సాధనాలుగా మారుతున్నాయి.

ఐనాచురలిస్ట్

ఇదొక ప్రకృతి ప్రేమికుల సమాజం. కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్, జియోగ్రాఫిక్ సొసైటీ సృష్టించిన వేదిక ఇది. ఇక్కడ పిల్లలు.. పెద్దలు తాము చూసిన మొక్కలు.. జంతువులు.. కీటకాల ఫొటోలను అప్లోడ్ చేస్తారు. ఇవి ఎక్కడ కనిపించాయో ఆ ప్లేస్ రికార్డు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు.. ప్రకృతి ఔత్సాహికులు ఆ ఫొటోలను చూసి జాతులను గుర్తిస్తారు. ఈ యాప్ స్కూల్ బుక్స్‌లోని జాతుల జాబితాలను గుర్తుపట్టే సాంప్రదాయ పద్ధతిని మించి ఆసక్తిని పెంచుతుంది. పిల్లలు తమ ఇంటి చుట్టూ ఎగురుతున్న సీతాకోక చిలుకలను గమనించి అవి పర్యావరణ వ్యవస్థలో ఎలా భాగమవుతాయో అర్థం చేసుకుంటారు.

ఐనేచర్ వాచ్

ఇది పిల్లలు తమ ఇంటి పరిసరాల్లోని జీవ జాతులను అర్థం చేసుకునేలా చేస్తుంది. రోజువారీ పరిసరాలను ఒక సమాజంగా మారుస్తుంది. దీనివల్ల ప్రకృతిపట్ల ఆసక్తి పెరుగుతుంది. దాన్ని కాపాడాలనే బాధ్యత ఏర్పడుతుంది. ముంబై.. ఢిల్లీ.. హైదరాబాద్.. కోల్‌కతాలోని 43 పాఠశాలల విద్యార్థులు ఐనేచర్ వాచ్ ఫౌండేషన్ నిర్వహించిన మూడు నెలల చాలెంజ్‌లో పాల్గొని 2771 కొత్త వన్యప్రాణి విజిటింగ్స్ నమోదు చేశారు. ఈ ప్రయత్నం స్థానిక జీవవైవిధ్య రికార్డులను సమృద్ధిగా చేసింది. విద్యార్థులను నిజమైన శాస్త్రీయ డేటాకు సహకరించే వారిగా మార్చింది.

సీక్ బై ఐనాచురలిస్ట్

ఇది చిన్న పిల్లల కోసం రూపొందించబడిన యాప్. అప్డేటెడ్ టెక్నాలజీతో ఇది మొక్కలు.. జంతువులు.. శిలీంధ్రాలను తక్షణమే గుర్తిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు పిల్లలుచూసిన వాటి పేర్లను వెంటనే తెలుసుకోవచ్చు. చిన్న వయసులోనే జీవవైవిధ్య పరిచయం ఈ యాప్ అందిస్తుంది. పిల్లలు ప్రకృతిని ఎలా చూస్తారు.? దానితో ఎలాంటి అనుబంధం కలిగి ఉంటారు అనేది ఇది చెప్తుంది. సీక్ కేవలం ఆనందం కోసమే కాదు. పిల్లను తమ పరిసరాలతో లోతైన అనుబంధాన్ని కలిగే మార్గం. అనుభవాత్మక అభ్యాసాన్ని పెంపొందించే యాప్ ఇది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, ది నాచురలిస్ట్ స్కూల్ సంయుక్తగా 2025లో నిర్వహించిన బయోబ్లిట్జ్ వంటి సామాజిక కార్యక్రమాలు, ఇండి బయో డైవర్సిటీ పోర్టల్ వంటి వేదికలు పిల్లలను స్థానిక వన్యప్రాణలను నమోదు చేయడంలో ప్రేరేపించాయి. 2024 సిటీ నేచర్ చాలెంజ్‌లో ఉత్తరాఖండ్లోని నానక్‌మట్టా పట్టణంలో 188 మంది విద్యార్థులు ఐనాచురలిస్ట్ యాప్‌ను ఉపయోగించి వృక్షజాతులు.. జంతు జాతులను నమోదు చేశారు.

Next Story