Influencers: సర్వేలో షాకింగ్ విషయాలు.. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పేవన్నీ నిజాలేనా?

by Javid Pasha |   (  Updated:2024-11-30 16:44:20  IST  )

Influencers : సర్వేలో షాకింగ్ విషయాలు.. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పేవన్నీ నిజాలేనా?

Influencers: సర్వేలో షాకింగ్ విషయాలు.. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పేవన్నీ నిజాలేనా?
X

దిశ, ఫీచర్స్ : సెలబ్రిటీలు, ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏది చెప్పినా ఫాలోవర్లు ఆసక్తిగా వింటారు. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలన్నీ నమ్మేవారు, ఫాలో అయ్యేవారు చాలా మందే ఉంటారు. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్లు షేర్ చేసే సమాచారమంతా నిజమేనా? అంటే.. అస్సలు కాదంటున్నారు నిపుణులు. ఐక్య రాజ్య సమితి, విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ(UNESCO) ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ ఇదే వెల్లడైంది. దీని ప్రకారం 62 శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు (Influencers) తాము ఆడియెన్స్‌తో పంచుకునే ఇన్ఫర్మేషన్‌లో నిజమెంత? ఎవిడెన్స్ ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవడం లేదని సర్వేను విశ్లేషించిన నిపుణులు అంటున్నారు.

స్టడీలో భాగంగా యూఎస్‌లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యునెస్కో తరఫున 45 దేశాల్లోని 500 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రశ్నించారు. వారు ప్రజలతో పంచుకున్న మోటివేషనల్, స్కిల్స్, ప్రాక్టీసెస్ అండ్ ఛాలెంజెస్ వంటివి నమ్మదగినవేనా? ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? అని ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన సర్వేలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 42 శాతం మంది అలాంటిదేమీ చేయలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తాము ఫాలోవర్లతో పంచుకునే సమాచారం నమ్మదగినది అని భావించి మాత్రమే షేర్ చేస్తుంటామని, ఎవిడెన్స్ వంటివి పెద్దగా పట్టించుకోవడం లేదని 62 శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు అంగీకరిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది. పైగా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో కంటెంట్‌కు లేదా పోస్ట్‌కు వచ్చిన లైక్‌లు, షేర్‌ల సంఖ్యను బట్టి సమాచారాన్ని నమ్మ దగినదిగా అంచనా వేస్తున్నారు తప్ప అది వాస్తవమా కాదా అని నిరూపించదగిన ఎవిడెన్స్ అయితే పరిశీలించడం లేదని సర్వేను ఎనలైజ్ చేసిన యునెస్కో పరిశోధకులు పేర్కొంటున్నారు.

మరో 19 శాతం మంది కంటెంట్ విషయంలో సదరు క్రియేటర్, రైటర్ లేదా పబ్లిషర్‌పైన డిపెండ్ అయి నమ్మేస్తున్నారు. అట్లనే సర్వే చేయబడిన ప్రతీ ఐదుగురిలో ఒకరు తాము నమ్మదగిన స్నేహితుల కంటెంట్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ఇక 37 శాతం మంది మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియాను సోర్స్‌గా ఉపయోగించుకుంటున్నారు. ఇక కంటెంట్‌ కోసం వారి మొదటి రెండు సోర్సెస్ వ్యక్తిగత అనుభవాలు, ఓన్ రీసెర్చ్ అండ్ ఇంటర్వ్యూలు కూడా ఉంటున్నాయి. అయితే జర్నలిస్టులు కూడా కంటెంట్ క్రియేషన్‌కు మెయిన్ సోర్స్ కాదని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కంటెంట్ క్రియేటర్లు మెరుగ్గా పనిచేసేందుకు మరింత అవగాహన, శిక్షణ వంటివి అవసరమని సర్వేలో పాల్గొన్న 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు సమాచార, పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించారని, సాంస్కృతిక, సామాజిక లేదా రాజకీయ వార్తలతో మిలియన్ల మందిని ఆకట్టుకుంటున్నారని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అలౌజే పేర్కొంటున్నారు. ఇలాంటప్పుడు వాస్తవ సమాచారంపైనే అందరూ ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.

Read More...

చదివింది గుర్తుండాలంటే ఇలా చేయండి..!




Next Story