ChatGPT Vs Auto Wala : ఇదెక్కడి ట్విస్ట్‌రా మామా.. ఏఐని ఇలా కూడా వాడొచ్చా.. ఆ స్కిల్స్ ముందు ఆడవాళ్లు కూడా పనికిరారు.. చూడాల్సిందే..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-04-30 09:16:19  IST  )

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా ప్రపంచంలో భారీ మార్పు కనిపిస్తోంది. వైద్య రంగం నుంచి విద్యారంగం వరకు ఎన్నో మార్పులకు కారణమవుతోంది. 2030 నాటికి ఏఐ అన్ని రోగాలకు చెక్ పెట్టేస్తుందని చెప్తున్నారు నిపుణులు

ChatGPT Vs Auto Wala : ఇదెక్కడి ట్విస్ట్‌రా మామా.. ఏఐని ఇలా కూడా వాడొచ్చా.. ఆ స్కిల్స్ ముందు ఆడవాళ్లు కూడా పనికిరారు.. చూడాల్సిందే..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా ప్రపంచంలో భారీ మార్పు కనిపిస్తోంది. వైద్య రంగం నుంచి విద్యారంగం వరకు ఎన్నో మార్పులకు కారణమవుతోంది. 2030 నాటికి ఏఐ అన్ని రోగాలకు చెక్ పెట్టేస్తుందని చెప్తున్నారు నిపుణులు. మరోవైపు హ్యూమన్ నీడ్ లేకుండా సెకన్‌కో మొబైల్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి మనోళ్లు మాత్రం తక్కువ తిన్నారా ఏంటి? మన లెవల్‌లో మనం ఉపయోగిస్తున్నాం. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌గా మార్చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఓ ముంబై యువకుడు ఏఐని బేరమాడేందుకు ఉపయోగించాడు. ఎస్.. మీరు వింటున్నది నిజమే. అక్షరాల బేరం కోసమే వాడాడు.

ముంబైకి చెందిన యువకుడు ఆటోలో ప్రయాణించాడు. ఈ క్రమంలో ఆటోవాలా ఆ జర్నీకి రూ. 200 అని చెప్పగా.. తక్కువ చేయమని ముందు సదరు వ్యక్తి కోరాడు. కానీ ఒప్పుకోకపోవడంతో ఏఐ హెల్ప్ తీసుకున్నాడు. తనకున్న స్కిల్స్ ఉపయోగించిన ఏఐ.. ఆడవాళ్లకు మించిన అదిరిపోయే స్కిల్స్‌తో బేరమాడింది. 200కు బదులు 120కి ఒప్పించింది. ఈ అబ్బాయి రోజూ ఇదే రూట్‌లో వెళ్తాడని.. మీరు చెప్పే రేట్ సబబుగా లేదని, కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా వేసి ఫైనల్‌గా ఆటోవాలా చెప్పిన రేట్ కాకుండా ప్రయాణికుడికి అనుగుణంగా మార్చేసింది.

Next Story