- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకలి నుంచి.. అందమైన మైనపు ప్రతిమ.!
మైనపు బొమ్మను జైపూర్ వాక్స్ మ్యూజియంలో ప్రతిష్టించే స్థాయికి ఎదిగింది

దిశ, ఫీచర్స్: ఏ విజయమూ అమాంతం వచ్చి చేతిలో పడదు. ప్రతీ రంగంలో.. ప్రతీసారి సాధనే నిలబెడుతుంది. ఆకలి నేర్పిన పాఠమే ఆకాశాన్ని హత్తుకునే విజయాలు అందిస్తుంది. భారత క్రికెట్ జట్టుకు గుండెకాయలా మారిన హర్మన్ ప్రీత్ కౌర్ విజయం కూడా అలాంటిది. ఒకప్పుడు ఆకలికి తట్టుకోలేక సమోసాలు తిని కడుపు నింపుకున్న హర్మన్ ప్రీత్ ఇప్పుడు తన మైనపు బొమ్మను జైపూర్ వాక్స్ మ్యూజియంలో ప్రతిష్టించే స్థాయికి ఎదిగింది.
లెజెండ్స్ పక్కన..
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కబోతోంది. జైపూర్ వాక్స్ మ్యూజియం తన మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుంది. సచిన్ టెండూల్కర్.. ఎమ్‌ఎస్ ధోనీ.. విరాట్ కోహ్లీ వంటి లెజెండ్స్ పక్కన హర్మన్ ప్రీత్ స్థానం సంపాదించుకుంది. ఇందులో భాగంగా జైపూర్ వాక్స్ మ్యూజియం క్యూరేటర్ అండ్ ఫౌండర్ అనూప్ శ్రీవాస్తవ హర్మన్ ప్రీత్ ప్రతిమను తయారు చేసేందుకు మ్యూజియం బృందాన్ని కొలతల కోసం పంపారు. ఆమె ఫొటోలు.. వీడియోలు రికార్డ్ చేశారు. నిజరూపంలో ఆ స్టార్ క్రికెటర్ మైనపు బొమ్మను మ్యూజియంలో కళాత్మకంగా పెడతారన్నమాట.
మ్యూజియంలో మైనపు బొమ్మ..
జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు బొమ్మ పెట్టడం అనేది తనకొక అరుదైన గౌరవం. యువతకు ప్రేరణ. మహిళా అథ్లెట్లకు మైలురాయి వంటిది. ఎలాంటి అవరోధాలు ఎదురైనా.. తమ కలలను సాకారం చేసుకోవచ్చని సాధారణ యువతకు సందేశాన్ని ఇస్తోంది. సమానత్వాన్ని ప్రోత్సహించే గొప్ప పరిణామంగా పరిగణించవచ్చు. ఈ స్థాయికి రావడానికి హర్మన్‌ప్రీత్ ఎంతో కష్టపడింది. పంజాబ్‌లోని మొగా అనే చిన్న పట్టణంలో పుట్టిన తను ఒకప్పుడు ఎన్నో అవమానాలను భరించింది. సమోసాలు తిని కడుపు నింపుకొని ఆడిన ఆమె ఇప్పుడు మ్యూజియంలో మైనపు బొమ్మ పెట్టేవరకు ఎదిగింది.
తాడోపేడో అని సవాల్..
21 ఏళ్ల హర్మన్ పాకిస్తాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలిసారి ఆడినప్పుడు మహిళా క్రికెట్‌కు అంత ప్రాముఖ్యతలేదు. "మహిళా క్రికెట్ అనేది కూడా ఉందా" అనే ఉద్దేశం చాలామందిలో ఉండేది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లు టీవీలో రావు. గ్రౌండ్స్ కూడా ఖాళీగానే ఉండేవి. ఇంకా మహిళా క్రికెటర్లకు ప్రత్యేకంగా జెర్సీలంటూ ఏవీ లేవు. పురుషుల జెర్సీలు కత్తిరించుకొని తొడుక్కునేవాళ్లు. అలాంటి పరిస్థితిని తన నైపుణ్యంతో మార్చి.. అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించింది హర్మన్ ప్రీత్ కౌర్. మహిళా క్రికెట్‌ను చూడటానికి ఎవరూ గ్రౌండుకు రాకపోయినా సరే.. తాను మాత్రం ఇక్కడే నిలబడి తాడోపేడో తేల్చుకుంటా అని సవాల్ చేసింది.
గర్వపడే ఘట్టం..
2025లో జరిగిన ఐదో వరల్డ్ కప్ తనకొక మంచి అవకాశంగా దొరికింది. కెప్టెన్‌గా సొంతగడ్డపై అడుగుపెట్టి ఆడటం అనేది తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టి.. ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి.. చివరి క్యాచ్ తన చేతిలో పడినప్పుడు క్రికెట్ లోకమంతా తన వైపే చూసింది. క్యాచ్ పడుతున్న ఆ క్షణం తనక్కూడా గర్వంగా అనిపించింది. ఆకాశంపైకి చూస్తూ క్యాచ్ పడుతుంటే తన కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఒక్కసారిగా సాధించాం అని అరిచింది. "మహిళా క్రికెటా" అని ఆశ్చర్యపోయినవాళ్లందర్నీ.. సంబ్రమాశ్చర్యానికి గురిచేసింది.






