- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Filter Coffee: ఫిల్టర్ కాఫీనా మజాకా.. మన కాఫీ క్రేజ్ అలాంటిది మరి
Filter Coffee: ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ కడుపులో పడితే కానీ.. మనస్సు ప్రశాంతంగా ఉండదు.

దిశ, వెబ్ డెస్క్: Filter Coffee: ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ కడుపులో పడితే కానీ.. మనస్సు ప్రశాంతంగా ఉండదు. కాఫీ వాసన పీల్చగానే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మరి అలాంటి కాఫీ లవర్స్ కు అదిరిపోయే న్యూస్. అదేంటంటే ట్రావెల్ గైడ్ ఫ్లాట్ ఫామ్ టేస్ట్ అట్లాస్ ఈ మధ్యే విడుదల చేసిన టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్ లిస్టులో మన ఫిల్టర్ కాఫీ టాప్ ప్లేసులో చోటు దక్కించుకుంది.
ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కాఫీ గింజలు, పలు రకాల కాఫీలు ఉన్నప్పటికీ ఫిల్టర్ కాఫీకి ఉన్న ప్రత్యేకతే వేరు. అందులోనూ భారతీయులు ఎంతో ఇష్టంగా తాగేది ఫిల్టర్ కాఫీనే. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ఫాట్ ఫాం టేస్ట్ అట్లాస్ ఈ మధ్యే రిలీజ్ చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కాఫీ రుచి, వాసన, కాఫీ తయారీకి ఉపయోగించే సాంప్రదాయ ప్రత్యేకమైన పద్దతుల ఆధారంగా ఈ ర్యాంకింగ్ లను ఇచ్చారు.
మొదటి స్థానంలో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. దీన్ని డార్క్ రోస్టెడ్ గింజలతో కాఫీ కాచేటప్పుడు చక్కెర కలుపుతుంటారు. దీనిని స్టవ్ టాప్ ఎస్ప్రెస్సో మేకర్ లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషీన్ లో తయారు చేస్తుంటారు. ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్ ను ఉపయోగించి తయారు చేస్తుంటారు. పాలతో మరిగించి చక్కెర కలపుకుని తాగుతారు. ఘిక మూడు నాలుగు స్థానాల్లో గ్రీస్ కు చెందిన రెండు రకాల కాఫీలు చోటు దక్కించుకున్నాయి. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్ కాఫీ, ఆరో స్థానంలో, ఇటలీకి చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్ కు చెందిన ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలిచాయి. చివరిగా 10వ స్థానంలో వియాత్నంకు చెందిన ఐస్డ్ కాఫీ నిలిచింది.
READ MORE ...
Water Fasting: 72గంటల వాటర్ ఫాస్టింగ్తో శరీరంలో ఏం జరుగుతుంది?






