ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారతీయ డైమండ్స్ రింగ్

by Disha Web Desk 12 |
ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారతీయ డైమండ్స్ రింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: 50,907 వజ్రాలతో భారతీయ ఆభరణాల ఉంగరం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒకే ఉంగరంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 50,907 వజ్రాలు అమర్చారు. 2023 మార్చి 11న ముంబైలోని హెచ్‌కె డిజైన్స్, హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని సాధించాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. కాగా ఇది పూర్తిగా రీసైకిల్ చేసిన బంగారం, వజ్రాలతో తయారు చేయబడింది. అలాగే ఇది కస్టమర్ల నుంచి వచ్చిన రాబడి నుంచి తిరిగి పొందబడింది. HK డిజైన్స్ ప్రకారం, రింగ్ విలువ $7,85,645 (₹6.4 కోట్లు).

Next Story

Most Viewed