Mother's legacy అవ్వ చెక్కుడు సంచి.!

by Daayi Srishailam |   ( Updated:2025-03-16 03:43:33.0  )
Mothers legacy అవ్వ చెక్కుడు సంచి.!
X

ఇప్పుడంటే..

ప్యాకెట్స్.. పౌచ్‌లు.. హ్యాండ్ బ్యాగులొచ్చాయి.

కానీ..

ఒకప్పుడు లేడీస్ యాక్ససరీస్ వేసుకోవడానికి ఏమున్నాయి.?

చెయ్యి సంచులు.. చెక్కుడు సంచులే కదా.!

మోడ్రన్ పాకెట్స్

తరం మారడమంటే క్యాలెండర్ పేజీలు మారడమే కాదు. మనిషి అవసరాలు మారతాయి. వ్యవహార శైలి మారుతుంది. డ్రెసింగ్ మారుతుంది. ఫైనల్‌గా జీవనశైలి మారుతుంది. లేడీస్ యాక్సెసరీసే తీసుకుందాం. మార్కెట్లోకి ఇప్పుడు తీరొక్క యాక్ససరీస్ వచ్చాయి. ఆభరణాలు మినహా మిగిలిన ఎలాంటి టూల్స్ భద్రపరచుకోవాలన్నా వెంట పౌచెస్ తీసుకెళ్తున్నారు. హ్యాండ్ బ్యాగులేని లేడీస్ కనిపిస్తారా.? ఇంకా మోడ్రన్‌గా చీరలకు.. డ్రెస్‌లకు పాకెట్స్ పెట్టుకుంటున్నారు. అదేనండీ జేబులు. చీరలకు కూడా జేబులంటే మనవాళ్లు ఎంత అప్డేట్ వెర్షనో అర్థం చేసుకోవచ్చు.

నేటితరం ట్రెండీ, మోడ్రన్ లేడీస్ ఎక్కువగా..

1. స్లాష్ పాకెట్స్

2. సైడ్ పాకెట్స్

3. హిప్ పాకెట్స్

4. సీమ్ పాకెట్స్ పెట్టుకుంటున్నారు.

వీటితోపాటు హిడెన్ పాకెట్స్ కూడా డ్రెసెస్‌కి, చీరలకు స్టిచ్ చేస్తున్నారు. అదేనండీ సీక్రెట్ జేబులు. కొందరు ప్యాచ్ పాకెట్స్ కూడా కుడుతున్నారు. ఇది డ్రెస్‌లో కలిసిపోయినట్లు డిజైన్డ్‌గా కనిపిస్తుంది.

అవ్వ సంచి..

90's కిడ్స్‌కు బాగా తెలుసు చెక్కుడు సంచంటే. దీన్నే బొడ్లెసంచి అని కూడా అంటారు. మన అమ్మమ్మలు.. నాన్నమ్మల విలువైన లాకర్లు ఇవి. ఎలాంటి చిన్న వస్తువైనా చెక్కుడు సంచిలోనే వేసుకునేవారు. ఒక 15-20 ఇంచుల పొడవున్న బట్టతో తయారుచేసే సంచి ఇది. దీంట్లో మూడు ప్రధాన అరలుంటాయి. వాటిలో పైసలుగానీ.. విలువైన సొమ్ములుగానీ వేసుకునేవారు. కింద ఫ్రంట్ ఫేస్‌లో 3-4 అరలుంటాయి. వీటిలో ఆకు.. వక్క.. సున్నం.. కాంటాలు వంటివి వేసుకునేవారు. పొలం పనికి వెళ్లినా.. ఊరికి వెళ్లి.. ఎటైనా దావతికి వెళ్లినా దీన్ని తీసుకునే వెళ్లేవారు. చిన్న పాకెట్లుున్నది బయటకు కనిపిస్తుంది. పొడవాటి అరలున్న భాగం చీర లోపలికి చెక్కుకుంటారు. పిల్లలు ఏదైనా కొనుక్కోవడానికి ఏమైనా కావాలంటే చెక్కుడు సంచిలోంచి పదో పావలో తీసి కొనిస్తుండేవాళ్లు మన అమ్మమ్మలు.. నాన్నమ్మలు. కొత్తగా పెండ్లయినవాళ్లు.. వైవాహిక యువతులు తప్ప మిగతా ఆడవాళ్లంతా ఈ చెయి సంచిని వాడేవాళ్లు.



Next Story