Hot Spring : స్నానం చేస్తున్నప్పుడు ఫోన్‌తో ఆ పనిచేస్తున్న 90% మంది యువత.. ఎక్కడంటే..

by Javid Pasha |

Hot Spring : స్నానం చేస్తున్నప్పుడు ఫోన్‌తో ఆ పనిచేస్తున్న 90% మంది యువత.. ఎక్కడంటే..

Hot Spring : స్నానం చేస్తున్నప్పుడు ఫోన్‌తో ఆ పనిచేస్తున్న 90% మంది యువత.. ఎక్కడంటే..
X

దిశ, ఫీచర్స్ : స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? చక్కగా షాంపూ చేసుకోవడం, సబ్బుతో శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవడం చేస్తారు. ఇక కొందరు బాత్ రూమ్ సింగర్స్ కూడా ఉంటారు. స్నానం చేస్తున్నప్పుడే వీరిలోని గాన గాంధర్వుడు మేల్కొంటాడు. అప్పటికప్పుడు గొప్ప గాయకులుగా మారిపోతుంటారు. కానీ జపనీస్ యువత మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ 90 % మంది షవర్ కిందనో, బాత్‌టబ్‌‌(‌(Bathtub))లోనో స్నానం చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండాల్సిందేనట. దీంతో మొబైల్ కంపెనీలు సైతం జపనీస్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ఫోన్లను మాత్రమే తయారు చేస్తుంటాయి. కారణం ఏంటంటే..

షవర్ కింద లేదా బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ మొబైల్ ఫోన్లలో గంటల తరబడి నిమగ్నమయ్యే అలవాటు ప్రపంచంతో పోలిస్తే జపాన్ యువతలో, మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంప్రదాయం అక్కడి హాట్ స్ప్రింగ్, అండ్ బాత్‌టబ్ సంస్కృతి(Bathtub culture) నుంచి ఉద్భవించిందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఇక్కడి ప్రజల్లో 90 % మంది షవర్ కింద లేదా బాత్‌టబ్‌లో గంటల తరబడి గడుపుతూ విశ్రాంతి తీసుకుంటారు.

బాత్‌టబ్‌లో రెస్టు తీసుకుంటూనే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తారు జపనీస్ ప్రజలు. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ అలవాటు మరింత ఎక్కువగా ఉంటుందల. బాత్‌టబ్‌లో ఉన్నప్పుడే యూట్యూబ్ వీడియోలు, సినిమాలు చూడటం, సోసల్ మీడియాను స్క్రోల్ చేయడం, స్నానం చేస్తూనే కాల్స్ మాట్లాడటం, ఛాట్ చేయడం వంటివి అధికంగా చేస్తుంటారు. ఈ అలవాటు కారణంగానే జపాన్‌ ప్రజలు వాటర్‌ప్రూఫ్ ఫోన్లు తప్ప వేరేవి కొనడానికి ఆసక్తి చూపరు. తయారీ కంపెనీలు సైతం ఇక్కడి జనాల ఆసక్తికి అనుగుణంగానే జపనీస్ మార్కెట్(Japanese market) కోసం ప్రత్యేక వాటర్ ప్రూఫ్ మొబైల్ ఫోన్లను తయారు చేస్తూ సొమ్ము చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.

Next Story