- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒళ్లంతా రిథమ్ మయం.. ఈ పాపని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది! (వీడియో)
ఈ పాప అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.A Little Girl Perfectly Imitates Dance Steps of Adults.

దిశ, వెబ్‌డెస్క్ః సాధారణంగా చిన్నారులు దేన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. ముఖ్యంగా అనుకరణలో వాళ్లు ఎంతో స్పీడ్‌గా ఉంటారు. కానీ, ఈ వీడియోలో అమ్మాయి మాత్రం స్పీడుకే స్పీడును నేర్పేటట్లు ఉంది. స్టేజ్‌పైన లైవ్‌లో వేస్తున డ్యాన్స్‌ను సేమ్ టు సేమ్ దించేసింది. ఈ వీడియోలో పెద్దవాళ్లకు ఒకరు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు. అంటే, ఎరోబిక్స్ లాంటిదనమాట. అయితే, ఇంతలో, ఓ మూడు నాలుగేళ్ల చిన్నారి డ్యాన్స్ ట్రైనర్ ముందు నిలబడి ఆమె వేసే ప్రతి అడుగును చాలా ఖచ్చితంగా కాపీ చేస్తున్నట్లే అనుకరిస్తుంది. ఎంతో కాన్ఫిడెంట్‌గా చిన్నారి చేస్తున్న తీరుకు అక్కడంతా ఆశ్చర్యపోతారు. చిన్నారి అప్రయత్నంగా చేస్తున్న నృత్యం మళ్లీ మళ్లీ చూడాలనిపించేదిగా ఉంటుంది. ఈ పాప భవిష్యత్తులో అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మెస్మరైజింగ్ క్లిప్‌ను @TheFigen ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్‌లు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. మీరూ చూడండి..!
Some are born with rhythm.
— Figen (@TheFigen) May 17, 2022
pic.twitter.com/EAgiQSTB1G






