- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిక్కిం శ్రీమంతుడు.. వ్లాగ్స్ ద్వారా పాఠశాలను మార్చేశాడు.!
కేవలం నెల రోజుల్లోనే సిక్కిం రిమోట్ పర్వతాల్లోని పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడు

దిశ, ఫీచర్స్: సిక్కింలోని ఒక చిన్న పర్వత గ్రామంలో అశ్వని థాపా అనే బిహార్ యువకుడు 30 రోజుల ప్రయాణంతో ఎంతోమంది పిల్లల జీవితాలను మార్చేశాడు. కేవలం నెల రోజుల్లోనే సిక్కిం రిమోట్ పర్వతాల్లోని పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం చిన్న విషయమేం కాదు.
గ్రేస్ పాఠశాల దుస్థితి..
అశ్వని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా "గ్రేస్ అకాడమీ" అనే పాఠశాల గురించి తెలిసింది. ఇది సిక్కింలోని "సర్డాంగ్" గ్రామంలో ఉంది. "లక్పా ధవా షెర్పా" దీనిని స్థాపించాడు. ట్రెక్కింగ్ వృత్తిని వదిలేసి రైతులు, రోజువారీ కూలీలు, ఒంటరి తల్లుల పిల్లలకు చదువు చెప్పడానికి పూనుకొని తన ఇంటిని 21 మంది పిల్లలకు హాస్టల్‌గా మార్చేశాడు. అశ్వని అక్కడకు వెళ్లినప్పుడు లైబ్రరీ లేదు. శుభ్రమైన నీరు లేదు. సరైన లైట్లు లేవు. అయినా పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. రిమోట్ ఏరియాల్లో ఇలాంటివి కామనే. కానీ ఇక్కడి పిల్లల ఉత్సాహం చూస్తే చదువంటే భవిష్యత్తును నిర్మించే ఆశ అని గుర్తుచేస్తుంది.
వ్లాగ్స్‌తో 10 లక్షల విరాళాలు
పాఠశాల స్థితిని చూసి నిస్సహాయంగా ఫీల్ అవ్వలేదు అశ్వని. తన కెమెరాను తీసుకుని పాఠశాలలో వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టాడు. మ్యాథ్స్ చెప్పడం.. పిల్లలతో నవ్వడం.. వారితో కలిసి గడపడం.. ఇవన్నీ రికార్డ్ చేశాడు. ఆ డైలీ రీల్స్ ఫ్యాన్సీగా లేకపోవచ్చు. హృదయాన్ని తాకేలా ఉన్నాయి. చాలా త్వరగా ఇంటర్నెట్లో ట్రెండింగ్ అయ్యాయి ఈ వీడియోలు. ఒక నెలలోనే అతని సహజమైన.. హృదయస్పర్శమైన వీడియోలు పాఠశాలకు రూ.10 లక్షల డొనేషన్స్ సమకూర్చాయి. సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనమో.. సరైన ఉద్దేశంతో ఉపయోగిస్తే సమాజాన్నెలా ప్రభావితం చేయగలదో నిరూపించాడు అశ్వని.
30 రోజుల్లోనే మారిపోయింది
అశ్వని హృదయాన్ని కదిలించిన ఒకమ్మాయి సమ్నిమా. హాస్టల్‌లో అందరికంటే ఆ పాపనే చిన్నది. ఆ పాప తనకు పూలు ఇస్తూనే ఉండేదట. అలా అశ్వని హృదయాన్ని గెలుచుకుంది. ఈ విషయాన్ని వ్లాగ్ చేశాడు అతను. వైరలైంది. ఇలా అతని వ్లాగ్‌లు కేవలం సమస్యలను మాత్రమే కాదు.. పిల్లల ఆనందం, స్థిరత్వం, అజేయమైన ఆత్మను చూపిస్తాయి. ఇప్పుడు గ్రేస్ అకాడమీ కొత్త భవనం, కంప్యూటర్ ల్యాబ్, ప్లేగ్రౌండ్‌తో పునర్నిర్మాణం అవుతోంది. ఇవన్నీ అశ్వని 30 రోజుల ప్రయాణంలో కంటెంట్ క్రియేషన్ ద్వారా సాధ్యమయ్యాయి. చూశారు కదా.. సోషల్ మీడియాను మంచికి వాడితే జీవితాలను కూడా మార్చగలదు.






