- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Imaginations : లెర్నింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్న ఊహలు!
Imaginations : లెర్నింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్న ఊహలు!

దిశ, ఫీచర్స్ : ఎవరైనా ఒక విషయంలో క్యూరియాసిటీ ప్రదర్శించినప్పుడు, ఇమాజినేషన్‌లో మునిగి తేలినప్పుడు అతిగా ఊహించుకుంటున్నారని భావిస్తుంటాం. కానీ వాస్తవానికి ఇది మంచి విషయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఊహించుకోవడం మనలో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని, లెర్నింగ్ సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల గత అధ్యనంలోనూ ఈ విషయం వెల్లడైంది.
ఊహలు మానవ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవడానికి పరిశోధకులు అనేక మందిని పరిశీలించారు. ఊహల రూపంలో మదిలో మెదిలే వాస్తవ సంఘటనలు, సన్నివేశాలు, విజువలైజేషన్ మెథడ్స్ సదరు వ్యక్తుల బ్రెయిన్‌లోని న్యూరాన్‌లలో ఎలాంటి ప్రతిస్పందనలను కలిగిస్తాయో విశ్లేషించారు. వాస్తవానికి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఊహించుకోవడం, ఏదైనా ఒక విషయంలో ఇమాజినేషన్‌లోకి వెళ్లడం బ్రెయిన్ ప్లాస్టిసిటీని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. పైగా కొత్త అనుభవాలకు ప్రతిస్పందనగా తమను తాము రీ మోడల్ తీసుకునే మెదడు సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయి. న్యూరో బయోలాజికల్ లెవెల్‌లో ఇమాజినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అవి వ్యక్తులు మరింత నేర్చుకోవడంలో, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుకోవడంలో దోహదపడినట్లు రీసెర్చర్స్ గుర్తించారు. అయితే నిశ్శబ్దమైన స్పేస్ ఇక్కడ కీ రోల్ పోషిస్తుందని కూడా చెప్తున్నారు.






