- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: నేను కూడా రైడర్‌నే బ్రో.. డాగ్ క్యూట్ వీడియో వైరల్!
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు లైక్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పెంపుడు కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలను ఇష్టపడుతుంటారు. అవి చేసే చిలిపి పనులు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పెట్ లవర్స్ (Pet lovers) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యజమానులు ఎక్కడి వెళ్లినా వారి వెంటే కార్లలో, బైక్‌లపై తమ పెట్స్‌ను కూడా తీస్కెళ్తుంటారు. ఓ బైక్ రైడర్ (Bike rider) కూడా తన పెంపెడు కుక్కను (Pet dog) తనతో పాటు బైక్‌పై తీసుకెళ్తున్నాడు. అయితే, తను ఎలాగైతే స్టైల్‌గా రెడీ అయ్యాడో తన పెట్‌ని కూడా అలాగే ముస్తాబు చేశాడు. రైడర్‌కి ధరించే.. హెల్మెట్, కళ్లద్ధాలు, డ్రెస్ అన్ని వేశాడు. అయితే, ఇక్కడ విశేషమేమిటంటే.. తన బైక్‌కు కుక్క కోసం ప్రత్యేకంగా ఓ మినీ బైక్‌ను జత చేయించాడు. దీంతో ఆ కుక్క కూడా తన యజమాని మాదిరిగా రైడర్‌గా ఫీల్ అవుతూ జర్నీ చేస్తుంది. అంతేకాదు తనే స్వయంగా తన బైక్‌ను డ్రైవ్ చేస్తున్నట్లుగా ఫోజులిస్తూ కూర్చుంది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. వావ్ కుక్కకు ప్రత్యేకంగా మోటర్ సైకిల్, సూపర్ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
The dog has his own motorcycle.. 😎 pic.twitter.com/7zg8u8VJoM
— Buitengebieden (@buitengebieden) March 25, 2025






