- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ ఆవిష్కరణ..! కిడ్నీ, లివర్ వ్యాధులను గుర్తించే బ్రీత్ ఎనలైజర్
రక్తం సేకరించకుండానే కేవలం శ్వాస ద్వారా వ్యాధులను నిర్ధారించే ఏఐ పరికరాన్ని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : కిడ్నీ స్టోన్స్ ఏర్పడ్డాయా? లివర్ డ్యామేజ్ అయిందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే డాక్టర్లు సజెష్ చేసిన మెడికల్ టెస్టులు, స్కానింగ్‌లు చేయించుకోవాల్సిందే. కానీ ఇంతకంటే సులభంగా జస్ట్ శ్వాస ఊదడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను గుర్తించగలిగే ఒక అద్భుత ఏఐ ఆధారిత బ్రీత్ ఎనలైజర్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరం కేవలం ఊపిరి ఊదిన కొద్ది సెకన్లలోనే కిడ్నీ, లివర్, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రారంభ సంకేతాలను గుర్తిస్తుంది.
ఖరగ్‌పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ నాన్-ఇన్వేసివ్ పరికరాన్ని రక్తం సేకరించకుండానే వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన స్క్రీనింగ్ పద్ధతిగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్ టి.కె భట్టాచార్య అండ్ ఆయన టీమ్ (అవిక్ సెత్, లిసా సర్కార్)ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు. ఈ పరికరం గురించి ఇటీవల సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఇక దీని పనితీరు విషయానికి వస్తే అధునాతన సెన్సార్లు (Field Effect Sensors) అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గా రిథమ్స్‌ను ఉపయోగిస్తుంది. కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులను గుర్తించడానికి శ్వాస ఊదినప్పుడు అందులోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్(VOCs)ను విశ్లేషించడం ద్వారా ఫలితాన్ని వెలువరిస్తుంది. ఉదాహరణకు డయాబెటిస్‌లో అసిటోన్ (Acetone), కిడ్నీ/లివర్ సమస్యల్లో అమ్మోనియా, క్యాన్సర్‌లో బెంజీన్ వంటి బయోమార్కర్లను గుర్తిస్తుంది.
ఏఐ ఆధారిత బ్రీత్ ఎనలైజర్ కిడ్నీ, లివర్ రోగులను పరీక్షించడానికి ఉపయోగించినప్పుడు ఆఫ్టికల్ డిటెక్షన్ టెక్నాలజీతో కలిపి ఏఐ ప్యాటర్న్‌లను పెద్ద మెడికల్ డేటా సెట్‌లతో పోల్చి రియల్ - టైమ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంతేకాదు ఇది హెల్తీ అండ్ డిసీజ్ ప్రొఫైల్స్ మధ్య తేడాను ఈజీగా గుర్తిస్తుంది. ట్రెడీషనల్ మెడికల్ టెస్టుల(బ్లడ్ టెస్టులు, ల్యాబ్ ప్రాసెసింగ్)కు భిన్నంగా సూది గుచ్చకుండానే, రక్తం సేకరించకుండానే, ల్యాబ్ అవసరం లేకుండానే సెకన్లలో వ్యాధి నిర్ధారణ ఫలితాలను వెల్లడిస్తుంది. అయితే ఇది ఇంకా మార్కెట్లోకి లేదా ఉపయోగం కోసం అందుబాటులోకి రాలేదు. ఇంకా ట్రయల్స్ జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఎర్లీ డయాగ్నెసిస్‌ను ప్రోత్సహిస్తూ ఆరోగ్య సంరక్షణలో మరో గొప్ప మార్పు వచ్చినట్టే.






