- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: మీ ఫోన్లో ఈ ఒక్క సెట్టింగ్ ఉంటే చాలు మీ ఫోన్ నీళ్లల్లో పడినా వెంటనే నీళ్లను బయటకు కక్కేస్తుంది..!
Viral Video: కొన్నిసార్లు ఫోన్లు వాటర్ లో పడటం వల్ల పనిచేయడం మానేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: కొన్నిసార్లు ఫోన్లు వాటర్ లో పడటం వల్ల పనిచేయడం మానేస్తుంటాయి. అలాంటి సమయంలో మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు బూడిద పాలవుతుంటాయి. ఫోన్ పోతే పోయింది కానీ అందులో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. అందులో ఉండే కాంటాక్ట్ నెంబర్స్, ఇతర డేటా మొత్తం కూడా మీ కెరీర్ ను ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయంలో మీ ఫోన్ వాటర్ లో పడినప్పటికీ కాపాడుకోవాలంటే అందులో ఒక ఫీచర్ గురించి తెలుసుకుంటే మంచిది.
ఈ ఫీచర్ ద్వారా మీరు వాటర్ లో పడినప్పటికీ ఫోన్ పూర్తిగా నీటిని బయటకు డ్రైవ్ చేస్తుంది. . అవునా మరి ఇలాంటి ఫీచర్ గురించి మాకు తెలియదే అని మీరు అనుకోవచ్చు కానీ ఈ ఫీచర్ ఉన్నది కేవలం ఆపిల్ ఐఫోన్లో మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఆపిల్ ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ వాటర్లో పడినప్పుడు. మీ ఐఫోన్ను జాగ్రత్తగా టవల్ తో తుడవాలి.
ఆ తర్వాత దాన్ని సెట్టింగ్స్ లోకి వెళ్లి యాక్సెసబిలిటీ లోకి వెళ్ళాలి...ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వాటర్ ఎజెక్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకొని మీ ఫోన్ వాటర్ లో పడ్డప్పుడు ఫోన్లు రెండుసార్లు టాప్ చేసినట్లయితే, కింద ఉన్న స్పీకర్ల లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది.
నిజానికి చూడు ఈ ఆప్షన్ low-frequency sound play చేయడం ద్వారా వాటర్ ను బయటకు పంపిస్తుంది. అయితే ఇది ఆపిల్ అధికారికంగా ఇచ్చిన ఫీచర్ కాదన్న సంగతి గుర్తించాలి. మీ ఐఫోన్ వాటర్ లో పడ్డప్పుడు ఈ విధానం ద్వారా 100% నీరు బయటకు వెళ్ళదన్న సంగతి గుర్తించాలి. . మీ సమీపంలో ఉన్న సపోర్ట్ సెంటర్ వారిని సంప్రదించినట్లయితే ఏం చేయాలో పరిష్కారం చెబుతారు.






