కలలో ఈ పక్షులు కనిపిస్తే.. కోటీశ్వరులు కావడం గ్యారెంటీ ?

by velandi.Saikiran |

హిందూ సంప్రదాయం ( Hindu tradition) చాలా గొప్పది. చాలా మంది హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కుటుంబంలో

కలలో ఈ పక్షులు కనిపిస్తే.. కోటీశ్వరులు కావడం గ్యారెంటీ ?
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ సంప్రదాయం ( Hindu tradition) చాలా గొప్పది. చాలా మంది హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కుటుంబంలో సమస్యలు రాకుండా, ఎక్కువ సంపాదన వచ్చేలా హిందూ సాంప్రదాయంలో నియమ నిబంధనాలను చాలా మంది పాటిస్తూ ఉంటారు. అలాగే చెడు జరిగినప్పుడు.. వాటిని దూరం చేసేలా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక మనకు కలలో అనేక రకాల పక్షులు (Birds) వస్తూ ఉంటాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం పక్షులు కలలోకి వస్తే... కొన్ని సమయాలలో మంచి జరుగుతుందని, మరికొన్ని సమయాలలో కీడు జరిగే ప్రమాదం పొంచి ఉందని చెబుతూ ఉంటారు పండితులు.

ముఖ్యంగా కలలో పాలపిట్ట కనిపిస్తే శుభసూచకమని చెబుతూ ఉంటారు. అలాగే హంసలు కనిపిస్తే కచ్చితంగా ఆర్థిక లాభం లేదా ఇంట్లో శుభకార్యం జరిగే ఛాన్స్ ఉంటుందట. ముఖ్యంగా కలలో నెమలి ( Peacock) కనిపిస్తే... ఇంట్లో కచ్చితంగా శుభ కార్యం... మంచి విజయం సాధిస్తారని చెబుతూ ఉంటారు. ఇంట్లో ఆనందం నిత్యం ఉంటుందట. అలాగే కలలో డేగ కనిపిస్తే... శుభప్రదంగా పరిగణిస్తారు. గుడ్లగూబ కలలో కనిపిస్తే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతూ ఉంటారు పండితులు. గుడ్లగూబ అంటే జనాలు అందరూ భయపడతారు కానీ... అది కలలోకి వస్తే ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయట. అలాగే ఉద్యోగం, వ్యాపారాలలో పురోగతి కూడా సాధిస్తారట.

Note : పైన పేర్కొన్న సమాచారం... ప్రముఖ పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పినవే.

Next Story