పగటిపూట నిద్రపోతే ఏమవుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

by Ratna Kumari |   (  Updated:2025-12-11 08:53:26  IST  )

సాధార‌ణంగా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే రోజుకు క‌నీసం ఎనిమిది గంటల నిద్ర త‌ప్ప‌నిస‌రి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

పగటిపూట నిద్రపోతే ఏమవుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
X

సాధార‌ణంగా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే రోజుకు క‌నీసం ఎనిమిది గంటల నిద్ర త‌ప్ప‌నిస‌రి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. నేటి వేగ‌వంత‌మైన జీవ‌న శైలి, రాత్రి వేళ‌ల్లో ప‌ని ఒత్తిడి, టెక్నాల‌జీ వినియోగం వంటి ప‌రిస్థితిలో నిద్ర‌లేమిని ఆ 8 గంట‌లు నిరంత‌రం నిద్ర ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. ఈ ప‌రిస్థితిలో నిద్ర‌లేమిని భ‌ర్తీ చేసుకోవ‌డానికి చాలా మంది బైఫాసిక్ లేదా పాలిఫాసిక్ విధానాన్ని అవ‌లంభిస్తారు. రాత్రిపూట నిద్ర త‌క్కువ అయితే ప‌గటిపూట నిద్ర పోవ‌డం ద్వారా దాన్ని భ‌ర్తీ చేసుకుంటున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు.

కానీ ఉద్యోగ ఒత్తిడి, టెక్నాలజీ వాడకం వంటి కారణాల వల్ల చాలా మందికి ఇది సాధ్యం కాలేదు. ఇలాంటి వారికి నిద్ర నిపుణులు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని సూచిస్తున్నారు. అదే బైఫాసిక్ నిద్ర. సాధారణంగా రాత్రి ఒకేసారి ఎక్కువసేపు నిద్రపోవడాన్ని అనుసరిస్తాం. కానీ ఈ కొత్త పద్ధతిలో రాత్రి కొద్దిసేపు, పగటిపూట కొంతసేపు నిద్రపోవడం ద్వారా మొత్తం నిద్ర లేమిని భర్తీ చేసుకోవచ్చు. నిద్రను ఇలా రెండు భాగాలుగా విభజించడం వల్ల మెదడుపై మంచి ప్రభావం ఉంటుంది. పగటిపూట చిన్న కునుకు తీయడం వల్ల దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఈ నిద్ర వల్ల శరీరంలో నిద్ర లేమి కారణంగా ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాత్రి నిద్ర సరిపోని వారు పగటి నిద్ర ద్వారా ఎనిమిది గంటల నిరంతర నిద్ర పొందినంత చురుకుదనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

Next Story