Viral : పొరపాటున భర్త భార్య బర్త్ డే తేదీని మర్చిపోయాడో..! ఊచలు లెక్కబెట్టాల్సిందే అక్కడ!!

by Javid Pasha |

Viral : పొరపాటున భర్త భార్య బర్త్ డే తేదీని మర్చిపోయాడో..! ఊచలు లెక్కబెట్టాల్సిందే అక్కడ!!

Viral : పొరపాటున భర్త భార్య బర్త్ డే తేదీని మర్చిపోయాడో..! ఊచలు లెక్కబెట్టాల్సిందే అక్కడ!!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. బర్త్ డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అలాంటివే. ప్రియమైన వ్యక్తి స్పెషల్ డేను గుర్తు పెట్టుకోవడం, విష్ చేయడం ఇరువైపులా ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యా భర్తల విషయంలో అయితే ఈ అనుబంధం మరింత ప్రత్యేకం. అయినప్పటికీ భార్య బర్త్ డేను భర్త మర్చిపోవడం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత భార్య అలగడం.. భర్త సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణగడం కామన్. కానీ సమోవా (Samoa) దేశంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే తన భార్య పుట్టిన(Wife's birthday) రోజు తేదీని మర్చిపోవడం(forgetting) నేరం. పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట.

వినడానికి వితంగా అనిపిస్తుండొచ్చు కానీ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని స్వతంత్ర ద్వీప దేశం అయిన సమోవా(Samoa)లో భర్త తన భార్య బర్త్ డేను మర్చిపోవడం నేరంగా భావిస్తారట. అందుకుగాను ఏకంగా 3 నుంచి 4 ఏండ్లు జైలు శిక్ష వేస్తారట. ఇక్కడ అమలవుతున్న భార్యా హక్కుల చట్టం ప్రకారం.. భర్త తన భార్య పుట్టిన రోజును ఫస్ట్ టైమ్ మర్చిపోయినట్లయితే.. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మొదటిసారి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట.

ఇక రెండవసారి కూడా రిపీట్ అయితే మాత్రం భర్తకు గరిష్ఠంగా ఐదేండ్లు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. అలాంటి చట్టాలు కూడా ఉంటాయా?, నిజమేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే నిజానికి అలాంటి చట్టాలేవీ సమోవా దేశంలో లేవు. కానీ 2007 నుంచి ఇక్కడ అలాంటి పౌరాణిక కథ(కల్పిత కథ) ఒకటి ప్రచారంలో ఉండగా, ఆ దేశ ప్రజలు దానిని సరదాకోసం తరచుగా ప్రస్తావిస్తూ పురుషులను, ముఖ్యంగా భార్యలు భర్తలను ఆటపట్టిస్తుంటారు.

Next Story