స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా..? ఐస్‌ క్యూబ్‌తో ఇలా చేస్తే క్షణాల్లో మాయం!

by Javid Pasha |   (  Updated:2026-04-15 08:25:20  IST  )

మెడపై ఐస్‌క్యూబ్ పెట్టినప్పుడు చల్లదనం మెదడుకు చేరి, పారాసింపతెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.

స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా..? ఐస్‌ క్యూబ్‌తో ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
X

దిశ, ఫీచర్స్ : ఎండలో తిరిగొచ్చాక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఆందోళనగా అనిపిస్తోందా? అయితే మెడ వెనుక భాగంలో చల్లని ఐస్ క్యూబ్‌‌‌తో కాపండి. కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని స్వయంప్రతిపత్తి నాడీవ్యవస్థ ప్రతిస్పందనవల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెడ వెనుక భాగంలో వెరీ టెంపరేచర్ సెన్సిటివ్ నరాలు ఉంటాయి. కాబట్టి ఐస్‌క్యూబ్ పెట్టినప్పుడు వీటి ద్వారా చల్లదనం మెదడుకు చేరి, పారాసింపతెటిక్ నాడీ వ్యవస్థను(Parasympathetic nervous system)యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది హార్ట్ రేట్ తగ్గించి, శరీరాన్ని శాంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో మెదడు నుంచి మెడ, ఛాతీ వరకు విస్తరించి ఉండే వేగస్ నరం (vagus nerve) కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఆందోళనతో వచ్చే గుండె కొట్టుకోవడం, అసౌకర్యం వంటి శారీరక లక్షణాలు తగ్గుతాయి. ఐస్ క్యూబ్‌లోని చల్లదనం మనసులోని రేసింగ్ థాట్స్ నుంచి దృష్టిని మళ్లించి, సెన్సరీ ఇన్‌పుట్ మీద ఫోకస్ చేయడం ద్వారా స్ట్రెస్ రెస్పాన్స్‌ను తాత్కాలికంగా అడ్డుకుంటుంది.

ఐస్‌క్యూబ్ పెట్టుకోవడంవల్ల ఆందోళన తగ్గుతుందనేది సాధారణ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌లో ఒక భాగం. 30 సెకన్ల నుంచి 3-3 నిమిషాలవరకు అలా పెట్డంవల్ల శరీరం ఫైట్-ఆర్-ఫ్లైట్ మోడ్ నుంచి ప్రశాంతమైన స్థితికి మారడానికి సహాయపడుతుంది. అంటే నాడీ వ్యవస్థకు ఒక వేగవంతమైన ‘రీసెంట్’ సిగ్నల్‌ను అందించడం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇది దీర్ఘకాలిక ఆందోళన లేదా రుగ్మతలకు శాశ్వత చికిత్స ఏమాత్రం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో దీనిని ఇంట్లోనే పాటించవచ్చు. అయితే తీవ్రమైన ఆందోళన, రుగ్మతలు వంటివి ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story