- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neem : రోజూ ఉదయాన్నే ఈ ఆకులు తింటే ఆ వ్యాధులన్ని మాయం..!
ఉదయాన్నే వీటిని తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : వేప చెట్టు ( Neem Tree ) మనందరికి గొప్ప వరం. ఎందుకంటే, దీనిలోని అన్ని భాగాలు - ఆకులు, పువ్వులు, బెరడు, కాయలు ఇలా అన్నింటినలో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా, వేప ఆకులను, కాయలను ఆయుర్వేదంలో ( Ayurvedam ) వాడుతున్నారు. ఈ కాలంలో కూడా వీటి డిమాండ్ కొంచం కూడా తగ్గలేదు. ఉదయాన్నే బ్రష్ చేసి ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం వలన అనేక ప్రయోజనాలను పొందొచ్చు. దీనిని ఎన్నో వేల సంవత్సరాల నుంచి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యల నుండి జీర్ణక్రియ వరకు.. ఇలా రకాల వ్యాధులను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఉదయాన్నే వీటిని తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే, మన శరీరం పోషకాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ మన శరీరానికి అందుతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.అలాగే, వీటిని తినడం వలన గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గించవచ్చు. ఇంకా మన శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఇతర వ్యాధుల నుంచి కాపాడుతాయి.
అలాగే, ఇవి చర్మ సంబంధిత ( skin problems) సమస్యలకు చెక్ పెడతాయి. తామర, సోరియాసిస్, మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. ఇది చర్మంపై ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాదు, వీటిని తినడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రేగులలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాపై పోరాడి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, ఆ ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజూ మూడు నుంచి నాలుగు ఆకులను నమలడం వలన నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. కడుపు నొప్పితో బాధ పడేవాళ్ళు వీటిని తప్పకుండ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






