Jaggery Water : ప్ర‌తిరోజూ బెల్లం నీళ్లు తాగితే మీ శ‌రీరంలో ఈ అద్భుతాలు జ‌ర‌గ‌డం ప‌క్కా..!

by Ratna Kumari |   (  Updated:2025-12-11 06:26:55  IST  )

Jaggery Water : సాధార‌ణంగా చాలా మంది స్వీట్లు అంటే లొట్ట‌లేసుకొని తింటుంటారు. కానీ చ‌క్క‌ర చేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్య‌త

Jaggery Water : ప్ర‌తిరోజూ బెల్లం నీళ్లు తాగితే మీ శ‌రీరంలో ఈ అద్భుతాలు జ‌ర‌గ‌డం ప‌క్కా..!
X

Jaggery Water : సాధార‌ణంగా చాలా మంది స్వీట్లు అంటే లొట్ట‌లేసుకొని తింటుంటారు. కానీ చ‌క్క‌ర చేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. ఎందుకంటే అది కొంచెం తీపి ఎక్కువ‌గా ఉంటుంది. కానీ బెల్లంతో చేసినవి ఆరోగ్యానికి చాలా మంచివి. బెల్లం పోష‌కాల నిధి అని చెప్ప‌వ‌చ్చు. చెరుకు ర‌సం నుంచి త‌యార‌య్యే బెల్లంలో శ‌క్తివంత‌మైన యాండిఆక్సిడెంట్లు ఉంటాయి. చాలా మంది భోజ‌నం త‌రువాత చిన్న బెల్లం ముక్క తిన‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. కొద్ది రోజుల పాటు ప్ర‌తీ రోజు బెల్లం నీటిని తాగితే శ‌రీరంలో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

చ‌ర్మ స‌మ‌స్య‌లు :

బెల్లం కేవలం అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆయుర్వేదంలో కూడా వేడి నీరు, బెల్లం మిశ్రమం చర్మానికి మేలు చేస్తుంది.

లివ‌ర్ హెల్త్ :

బెల్లంలో లభించే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. బెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు కొవ్వు కాలేయ సమస్యలు వంటి వాటిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

పీరియడ్స్ నొప్పి :

మహిళలకు బెల్లం నీరు ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. బెల్లం కషాయంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు.. పీరియడ్స్ సమయంలో సంభవించే కడుపు నొప్పి, బలహీనత, మానసిక స్థితిలో మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సమయంలో మహిళలు బెల్లం నీటిని లేదా బెల్లం కషాయాన్ని తాగడం చాలా మంచిది.

జీర్ణవ్యవస్థ :

ఉద‌యం వేళ‌ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో బెల్లం కలిపి తాగడం జీర్ణక్రియకు అత్యంత ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తుంది. కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.

Next Story