- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Health Tips : వర్కౌట్స్ చేయడానికి టైమ్ లేదా..? ఈ ఒక్క మార్పు చేసుకున్నా హెల్తీగా ఉండొచ్చు!

దిశ, ఫీచర్స్ : అధిక బరువుతో అవస్థలు పడుతున్నా.. వ్యాయామం చేయడానికి టైమ్ కుదరట్లేదా? బిజీ షెడ్యూల్ కారణంగా సరైన డైట్ పాటించలేకపోతున్నారా? అయినా సరే చింతించకండి. మీ రోజువారీ ఆహారపు అలవాట్లలో ఈ ఒక్క మార్పు చేసుకుంటే చాలు. ఫిట్‌గా, హెల్తీగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా మార్పు? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
* వ్యాయామాలు, సరైన ఆహార నియమాలు పాటించే సమయంలేకపోతే.. మీ రోజువారీ డైట్‌లో అధిక చక్కెరలను తగ్గించినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెరలో అంటే తియ్యటి ఆహారాలు, పానీయాలలో ఫ్రక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అట్లనే షుగర్ రిలేటెడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల అందులోని సుక్రోజ్ అండ్ ఫ్రక్టోజ్ సమ్మేళనాలు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. కాబట్టి వాటిని తగ్గించాలంటున్నారు నిపుణులు.
*ఇక డైట్‌లో షుగర్ తగ్గించడంవల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చూస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా మీ రొటీన్ నుంచి షుగర్‌ను తగ్గించడంవల్ల డైజెస్టివ్ హెల్త్ కూడా మెరుగు పడుతుంది. కేలరీలు ఆటోమేటిగ్గా బర్న్ అవుతాయి. దీంతో బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే చాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక బరువు కూడా తగ్గుతారు.
*అధిక చక్కెరలు కలిగిన పదార్థాలు మానేయడంవల్ల ముఖంలో వృద్ధాప్య ఛాయలు, మొటిమలు వంటివి దూరం అవుతాయని. యంగెస్ట్ లుక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. దంతాలు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన వంటివి రావు. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.