చీకటి పడ్డాక ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టమే..!

by Disha Web Desk 6 |
చీకటి పడ్డాక ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టమే..!
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ ధర్మం ప్రకారం కొన్ని దానధర్మాల విషయం కొన్ని పద్ధతులను పాటిస్తారు. జీవితంలో కష్టపడి సంపాదించిన సంపదలోంచి ఎంతో కొంత దానధర్మాలకు ఉపయోగిస్తేనే మంచి జరుగుతుందని నమ్ముతారు. మహిళలు కొన్ని సమయాల్లోనే దానధర్మాలు చేయాలని లేదంటే కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతుంటారు. ముఖ్యంగా చీకటి పడ్డాక ఈ వస్తువులను అస్సలు దానం చేయకూడదట. ఒకవేళ చేస్తే దరిద్రం వెంటాడుతుందట. చీకటి అయ్యాక పాలు, పెరుగును దానం చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు పోతుంది. దీంతో డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పసుపు, ఉప్పును సాయంత్ర సమయాల్లో ఎవరికైనా పెడితే అరిష్టమే. కాబట్టి సాయంత్రం పూట వీటిని దానం చేయకపోవడం మంచిది. ఉల్లి, వెల్లుల్లిని దానం చేయడం వల్ల గ్రహాలపై ప్రభావం పడి సంపద కోల్పోయి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చీకటి పడ్డాక ఈ వస్తువులను అస్సలు దానం చేయకూడదు.

Also Read...

ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..!

Next Story

Most Viewed