- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beauty tips : మునుగాకు రసంతో ముఖ వర్ఛస్సు.. ఏం చేయాలంటే..
Beauty tips : మునుగాకు రసంతో ముఖ వర్ఛస్సు.. ఏం చేయాలంటే..

దిశ, ఫీచర్స్ : చాలా మంది ఏజ్‌తో సంబంధం లేకుండా తమ ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల లోషన్లు, క్రీములు వాడుతుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండానే కేవలం మునగాకు రసంతో మీ ముఖంలో గ్లో పెంచుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అందుకోసం పిడికెడు లేదా ఒక కప్పు మునగాకుల్ని తీసుకోవాలి. వాటిని మెత్తగా నూరడం ద్వారా వచ్చే రసాన్ని సేకరించి, రోజూ పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ ఇలా చేయడంవల్ల ముఖంపై, మెడపై నలుపు ఛాయలు, మొటిమలు, ముడతలు క్రమంగా తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా కనిపిస్తుంది.
కళ్లకింద నలుపు పోవాలంటే..
కొందరిలో కళ్లకింద లేదా కళ్ల చుట్టూ ముడతలు లేదా నల్లబడటం కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న కప్పులో పాలను తీసుకొని, అర స్పూన్ తేనె కలిపి ముడతలు, నలుపు ఉన్న భాగాల్లో నిద్రకు ముందు అప్లయ్ చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంరోజుల్లో సమస్య దూరం అవుతుంది.
పెదవులపై పగుళ్లకు
పెదవులు తడి ఆరిపోయినట్టుగానో, పగుళ్లుగానో అనిపిస్తే అందం దెబ్బతింటుంది. ఇలాంటివారు పడుకునే ముందు అలోవెరా జెల్ అప్లయ్ చేసి, రెండు గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. క్రమంగా పెదవులు సాధారణ స్థితికి వస్తాయి. ఈ విధమైన టిప్స్‌తోపాటు తరచూ పౌష్టికాహారం, తాజా పండ్లు తీసుకుంటూ ఉండటంవల్ల కూడా చర్మ సౌందర్యం, ముఖ వర్ఛస్సు పెరిగే అవకాశాలు ఉంటాయని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






