- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tips: అన్యోన్య దాంపత్యానికి ఐదు సూత్రాలు..!
అన్యోన్య దాంపత్యానికి ఐదు సూత్రాలు..

దిశ, పీచర్స్: భార్య భర్తలు పెళ్లైన కొత్తలో కొంతకాలం వరకు సంతోషంగా ఉన్నప్పటికీ.. కాలం గడుస్తున్న కొద్ది చిన్న చిన్న గొడవలు, కొన్ని విషయాల్లో మనస్పర్థలు రావడం సహజమే. నువ్వేంత అంటే నువ్వేంత అని గొడవలు పడితే.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఎలాంటి పరిస్థితులకైనా దారితీయవచ్చు. అలాంటివీ జరగకుండా ఉండాలంటే భార్యభర్తలు ఇద్దరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
నిజానికి తప్పులు అనేవి ఇద్దరిలో ఎవరివల్లనైనా జరగవచ్చు. కొంతమంది భాగస్వామి చేసిన చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేస్తూ.. భూతద్దంలో చూస్తుంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. అలాకాకుండా ఆ తప్పు చేయడానికి గల కారణాలను తెలుసుకుని, దానికి పరిష్కారాన్ని వెతకాలి.
* భాగస్వామితో ఎలాంటి విషయాన్ని అయినా పంచుకునేలా ఉండాలి. వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల గురించి మాట్లాడితే.. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొందరు భయం లేదా సంశయంతో కొన్ని విషయాలను భాగస్వామికి చెప్పకుండా దాచిపెడుతుంటారు. ఇలా చేయడం వల్ల వారికి ఏదో ఒక రోజు నిజం తెలిసినప్పుడు మీపై నమ్మకాన్ని కోల్పోతారు. అందుకే వీలైనంతవరకు ప్రతీ విషయాలను భాగస్వామికి చెప్పడం మంచిది.
* సంసారంలో భార్యభర్తుల ఇద్దరూ ఒక్కటే అనుకుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని అధిమించవచ్చు. అలాకాకుండా తనదే పైచేయి కావాలి, తనమకు నచ్చినట్లుగా జరగాలి, ప్రతీ విషయం తనకు తెలియాలనుకుంటే మాత్రం అది అవతలి వ్యక్తికి ప్రశాంతత, సహనంను కోల్పోయేలా చేస్తాయి. ఇది ఎలాంటి పరిస్థితులకైనా దారితీయవచ్చు.
* ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ తరువాత సొంత అభిప్రాయాన్ని వ్యక్తం పరచాలి. అంతేకానీ భాగస్వామి నిర్ణయాలు ఎప్పుడూ తప్పని భావించకూడదు.
* ఎదుటివారి ఇష్టాలు, అభిప్రాయాలు, భావోద్వేగాలకు విలువనివ్వాలి. ఇలాగే ఉండాలని వారికి కండీషన్స్ పెట్టకూడదు. ఇది కొంత కాలానికి భాగస్వామిపై ప్రేమను తగ్గించేలా చేస్తుంది.
* ఏదైన చిన్న గొడవ వచ్చినప్పుడు గతాన్ని తవ్వుకోకూడదు. ఇలా చేయడం వల్ల చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి. వేర్వేరు మనస్తత్వాలు కలిగిన భార్యభర్తలిద్దరూ ప్రతీ విషయంలోనూ సర్దుబాటును అలవరుచుకోవాలి.






