Love tips: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు..!

by Kanadam.Hamsa lekha |

Love tips: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు..!
X

దిశ, ఫీచర్స్: ప్రేమ అయినా స్నేహమైన ఎలాంటి బంధం అయినా సరే ఎదుటి వ్యక్తి నచ్చితేనే మొదలవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు.. అబ్బాయిల విషయంలో రాజీ పడటానికి అస్సలు ఇష్టపడరు. అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చాలంటే ఆరడుగులు, సిక్స్ ప్యాక్ బాడీ, మంచి కలర్ ఉండాలని అనుకుంటారు. దాని కోసం అబ్బాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలకు నచ్చాలంటే ఎలా ఉంటే బాగుటుందా అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారట. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

* తెలివైన అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉండే అబ్బాయిలంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

* కండీషన్లు పెట్టే వాళ్లకంటే.. ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయిలను ఇష్టపడుతుంటారు. మగవాళ్లు చెప్పింది కచ్చితంగా ఆడవాళ్లు వినాలి అనే అభిప్రాయం ఉన్న వారిని అమ్మాయిలు దూరం పెడతారు. సమానత్వం చూపించే అబ్బాయిలంటే మక్కువ ఎక్కువ.

* సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ ఉండి ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం. కలుపుగోలుగా మాట్లాడే అబ్బాయిలను వారు అస్సలు వదులుకోరు.

* ఫ్యామిలీ రిలేషన్స్‌కి విలువ ఇస్తూ.. వారిని గౌరవించే వారంటే అమ్మాయిలకు ఇష్టం. అగౌరవపరిచే ప్రవర్తనను ఎవ్వరూ ఇష్టపడరు. చిన్న చూపు చూడడం, ప్రతీ విషయాన్ని తిరస్కరించడం వంటివి అమ్మాయిలో అయిష్టాన్ని పెంచుతాయి. పరస్పర గౌరవం అమ్మాయిలకు నచ్చే అంశం. ఇది బంధాన్ని మరింత స్ట్రాంగ్‌గా ఉంచుతుంది.

* ముఖ్యంగా అమ్మాయిలను గౌరవించి మాట్లాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దిక్కులు చూడకుంటూ కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడే వారిపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఒక విషయాన్ని అడిగితే దానిని నావిగేట్ చేయడానికి ప్రయత్నించే అబ్బాయిలంటే అస్సలు నచ్చరు.

* ఏ విషయంలోనైనా చురుకుగా ఉంటూ చొరవ తీసుకుని ముందుకు సాగే అబ్బాయిలంటే అమ్మాయిలకు నచ్చుతారు. ఇతరు పట్ల అసూయను పెంచుకోవడం, అభద్రతా భావం ఉంటే అది ప్రేమ బంధాన్ని దెబ్బతీస్తుంది.

Next Story