- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Foodstuffs: కల్తీని గుర్తించండిలా..!
ఇటీవల కాలంలో ఆహార పదార్థాల విషయంలో బాగా కల్తీ జరుగుతోంది. ఏది తినాలి ఏది తినకూడదో కూడా తెలియకుండా పోతుంది.

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో ఆహార పదార్థాల విషయంలో బాగా కల్తీ జరుగుతోంది. ఏది తినాలి ఏది తినకూడదో కూడా తెలియకుండా పోతుంది. అనేక ఆహార పదార్థాలు, పండ్లు, మసాలాలు, పాలు వంటి వాటిలో ఎక్కువగా కల్తీ జరుగుతోంది. వీటిలో వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది. ఇటువంటి కల్తీ పదార్థాలను ప్రతి రోజూ తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ సమస్యలను దూరం చేసేందుకు ఒకసారి పదార్థాలను చెక్ చేసుకోవడం మంచిది. అదెలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బెల్లం: బెల్లంలో కల్తీ జరిగిందా లేదా అని నీళ్లను ఉపయోగించి తెలుసుకోవచ్చు. బెల్లంలో మెటానిల్ పసుపు రంగును కలిపి కల్తీ చేస్తారు. బెల్లం ఒరిజనల్ అని తెలుసుకోవాలంటే దాన్ని నీళ్లలో వేస్తే సరిపోతుంది. మంచి బెల్లం అయితే నీటిలోనే కరిగిపోతుంది. కల్తీది అయితే నీటి అడుగున తెట్టులా తేలుతుంటుంది.
పాలు: ఈ రోజుల్లో తాగే పాలు కూడా కల్తీగా మారిపోతున్నాయి. పాలలో ఎక్కువగా నీళ్లు కలపడమే కాకుండా.. అవి చిక్కగా ఉండడం కోసం డిటర్జెంట్లు, సింథటిక్ పాలను కూడా కలుపుతారు. దీనిని గుర్తించాలంటే పాలను వేళ్ల మధ్యలో రుద్దినప్పుడు అది సబ్బు నురుగలా వస్తే అది సింథటిక్ పాలని అర్థం.
పంచదార: పంచదారలో సున్నం లేదా ప్లాస్టిక్ పొడిని కలుపుతుంటారు. ఇది కల్తీదా లేదా అని తెలుసుకోవాలంటే ఒక గ్లాసు నీటిని తీసుకొని, అందులో టీ స్పూన్ పంచదారను వేసి నీటిలో బాగా కలపాలి. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే మంచిది అని అలా కాకుండా కొన్ని చిన్న చిన్న కణాలు కరగకుండా కనిపిస్తే అది కల్తీది అని గుర్తించాలి.
పసుపు: ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో కొంచెం పసుపు కలపండి. అది కల్తీ అయితే గ్లాసు అడుగుభాగంలో పసుపు కనిపిస్తుంది. కల్తీ పసుపు ఉన్న నీరు మరింత పసుపు రంగులో కనిపిస్తుంది.
శనగపిండి: శనగపిండిలో బియ్యపిండి, మిఠాయి రంగును కలిపి కల్తీ చేస్తుంటారు. కొద్దిగ శనగపిండిలో కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి కొంత సమయం వేచి ఉండాలి. శనగపిండి రంగు ఎర్రగా మారితే అది కల్తీ పిండి అని అర్థం.
పండ్లు: చాలా వరకు పండ్లు, కూరగాయలను కూడా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆపిల్. సాధారణంగా ఆపిల్ పండ్లు బాగా మెరుస్తున్నట్లు కనిపిస్తే అది కల్తీది అని గుర్తించాలి. ఆపిల్‌ని మెరిపించడానికి దానిపై మైనపు పొరను అప్లై చేస్తుంటారు. దీన్ని తెలుసుకోవాలంటే కత్తితో ఆపిల్ పొరపై నెమ్మదిగా రుద్దండి. తెల్లటి పొర కనిపిస్తే అది కల్తీ ఆపిల్.
జీలకర్ర: వంటల్లో చీలకర్ర చాలా ముఖ్యం. ఈ జీలకర్రను రెండు చేతుల మధ్య ఉంచి నలిపినప్పుడు చేతికి రంగు అంటితే కల్తీ జరిగిందని అర్థం.
నెయ్యి: నెయ్యి లేదా వెన్నలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి కొంత సమయం వేచిఉండాలి. అది ఎరుపు రంగులోకి మారితే అందులో కల్తీ జరిగింది.
కారం: ఒరిజనల్ కారం అయితే నీటిలో వేసినప్పుడు అది తేలితే స్వచ్ఛమైనది అని, అలా కాకుండా మునిగిపోతే అందులో కల్తీ జరిగిందని గుర్తించాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.
Read More...






