- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌండ్‌ను ఫిల్టర్ చేయడంలో బ్రెయిన్ సూపర్ ఫాస్ట్.. ఒకేసారి వందకుపైగా!
సౌండ్‌ను ఫిల్టర్ చేయడంలో మన బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్: భారీ సౌండ్ పొల్యూషన్‌లోనూ మనం కొన్ని ప్రత్యేక శబ్దాలను గుర్తించే సామర్థ్యాలపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనవసరమైన శబ్దాలను పక్కన పెట్టి ముఖ్యమైన సౌండ్స్‌పై దృష్టి కేంద్రీకరించే అద్భుతమైన సామర్థ్యం మన మెదడుకు ఉంది. దీనినే శాస్త్రీయంగా ‘కాక్టెయిల్ పార్టీ ఎఫెక్ట్’ అని కూడా పిలుస్తారు. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం వందల మంది మాట్లాడుతున్న చోట కూడా ఇతర సౌండ్స్‌ను ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన వ్యక్తి మాటను స్పష్టంగా అందిస్తుంది. అలాగే మెదడు కేవలం సౌండ్ వినడమే కాకుండా అది ఏ రకమైన శబ్దమో కూడా క్షణాల్లో పసిగట్టేస్తుందని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఈ మేరకు 10 దేశాల్లో 149 మందిపై చేపట్టిన పరిశోధనల్లో ఇంట్రెస్టింగ్ అంశాలు వెల్లడించారు. ఈ ప్రక్రియలో మొదట గాలిలోని కంపనాలు మన చెవిని చేరుతాయి. వెంటనే ఏ శబ్దంపై దృష్టి పెట్టాలనేది మొదడు నిర్ణయిస్తుంది. దీనినే ‘బైనరల్ హియరింగ్’ అంటారు. లోపలి చెవి (Cochlea) ఈ శబ్దాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఇవి బ్రెయిన్‌లోని ఆడిటరీ కార్టెక్స్ (Auditory Cortex)కు చేరుతాయి. చెవికి వినిపించే సౌండ్ ఒక పాటలోని ట్యూనా? లేక ఒకరి మాటలా? అనేది బ్రెయిన్ వేగంగా ఫిల్టర్ చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారి గొంతు, మాట్లాడే తీరును మెదడు ముందే స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ వెనుక నుంచి ట్రాఫిక్ శబ్దం వచ్చినా పట్టించుకోకుండా మనతో సంభాషించే వారి మాటలనే స్పష్టంగా వినిపిస్తుంది. ఇందుకు మెదడులోని థాలమస్ (Thalamus) అనే భాగం ఒక గేట్ కీపర్‌లా పనిచేస్తుంది. ప్రమాద హెచ్చరికలను అలర్ట్ చేస్తుంది. ఇక ఆడిటరీ కార్టెక్స్ అనేది సౌండ్ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తే.. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏ శబ్దం వినాలో అలర్ట్ చేస్తుంది. ఇక తెలిసిన గొంతులను గుర్తించడంలో హిప్పోక్యాంపస్ సహాయపడుతుందని నార్త్ ఈస్టర్న్ పరిశోధన వెల్లడించింది.
మన మెదడు శబ్దాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు అది మన దైనందిన జీవితంపై ఎఫెక్ట్ చూపుతుంది. దీనిని సాధారణంగా ‘ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్’ (APD) అని పిలుస్తారు. చెవుల వినికిడిలో ఏ సమస్యా లేకపోయినా మెదడు ఆ శబ్దాలను అర్థం చేసుకోవడంలో తప్పులు చేస్తుంది. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వెనుక ఏదైనా చిన్న సౌండ్ వినిపించినా వారి మాటలు అర్థం కావు. పదాల మధ్య తేడాలను గుర్తించలేక చాలా అసౌకర్యంగా ఫీలవుతారు.






