సమంత-నాగచైతన్య చేసిన తప్పు ఇదే.. పెళ్లి రోజు ఫిక్స్.. కానీ ఆ క్షణం వద్దనుకునే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-24 08:54:00  IST  )

సాధారణంగా ఫస్ట్ టాటూను ఫస్ట్ కాఫీతో పోలుస్తారు. అంటే మళ్లీ కాఫీ తాగాలని కోరుకున్నట్లే.. టాటూ కూడా వేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ టాటూ శాశ్వతంగా ఉండిపోతుంది. మీలోని కమిట్మెంట్‌ను తెలుపుతుంది. ప్రతిరోజు ఈ ఇంక్ మార్క్‌ను చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి లేదా ఒక విషయం గురించి టాటూ వేయించుకోవాలని అనుకున్నప్పుడు

సమంత-నాగచైతన్య చేసిన తప్పు ఇదే.. పెళ్లి రోజు ఫిక్స్.. కానీ ఆ క్షణం వద్దనుకునే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఫస్ట్ టాటూను ఫస్ట్ కాఫీతో పోలుస్తారు. అంటే మళ్లీ కాఫీ తాగాలని కోరుకున్నట్లే.. టాటూ కూడా వేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ టాటూ శాశ్వతంగా ఉండిపోతుంది. మీలోని కమిట్మెంట్‌ను తెలుపుతుంది. ప్రతిరోజు ఈ ఇంక్ మార్క్‌ను చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి లేదా ఒక విషయం గురించి టాటూ వేయించుకోవాలని అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాకే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఆ పర్సన్ లేదా థింగ్‌తో కనెక్షన్ తగ్గిపోవచ్చు. ఎందుకు వేయించుకున్నానా అని రిగ్రెట్ ఫీల్ కావొచ్చు. మరో పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ద్వారా దాన్ని రిమూవ్ చేయాల్సి రావొచ్చు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సమంత-నాగచైతన్య. తమ పెళ్లి రోజును టాటూ వేయించుకున్న వారు.. విడాకులు తీసుకున్నాక.. ఆ క్షణాన్ని మరిచిపోయేందుకు తీసేయక తప్పలేదు. ఇలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండేందుకు కింది విషయాలను పరిగణలోకి తీసుకోండి.

పచ్చబొట్టు వేయించుకోవడం వెనుక ఉన్న సైకాలజీ వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. సాంస్కృతిక, భావోద్వేగ, వ్యక్తిగత ప్రాధాన్యతల ద్వారా కూడా ప్రభావితమవుతుంది. చాలా మంది ఫ్యాషన్, ఆర్ట్, కల్చర్‌పై ప్రేమతో టాటూలు వేయించుకుంటారు. కానీ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆధారంగా టాటూలు వేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది భావోద్వేగ వ్యక్తీకరణ, సామాజిక సంబంధానికి చెందినది. ఒక హఠాత్తు నిర్ణయం లేదా పరివర్తనకు చిహ్నంగా కూడా ఉంటుంది. వ్యక్తిగత పెరుగుదల, వైద్యం లేదా ముఖ్యమైన జీవిత సంఘటనల గురించి తెలుపుతూ.. ఆ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంక్ చేయించుకున్న వ్యక్తి మాదిరిగానే వాటి అర్థం కూడా స్పెషల్‌గా ఉంటుంది.

ఇలా నిర్ణయించండి:

* ముఖ్యంగా టాటూకు మన బాడీలో సరైన ప్లేస్ ముఖ్యం. సాధారణంగా జనం ముంజేయి, మణికట్టు, వీపుపై వేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే ఈ ప్రాంతాలు తక్కువ పెయిన్‌గా ఉంటాయి.

* డిజైన్ విషయానికొస్తే మినమిలిస్ట్ సింబల్స్ ఇష్టపడుతారు. ఫ్లవర్స్, మ్యూజిక్ సైన్స్, కోట్స్, రేఖా గణిత నమూనాలను ఎంచుకుంటారు. ఈ ఎంపిక పర్సనల్ స్టైల్, బాడీ షేప్, టాటూ ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటాయి.

* చాలా మంది అందరికీ కనిపించేలా టాటూ వేసుకుంటారు. ఇంకొంత మంది ఇలా ఉండేందుకు ఇష్టపడరు. కారణం.. ఇది విసుగు, భావోద్వేగ తీవ్రత, ప్రొఫెషనల్ యాక్సెప్టెన్స్ అయ్యుండొచ్చు. అయితే టాటూలను కనిపించని చోట ఉంచాలనే ఆలోచన భవిష్యత్తులో విసుగు చెందుతుందనే నమ్మకం నుంచి వస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. కానీ అందరికీ ఇలా ఉండకపోవచ్చు. కొందరికి విలువైన జ్ఞాపకాలుగా, వ్యక్తిగత కథలుగా, చూసిన ప్రతిసారి ఆనందాన్ని ఇవ్వొచ్చు.

* టాటూల విషయంలో చింతించేందుకు పెద్ద కారణం ఆకస్మిక లేదా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. టీనేజర్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తమ మధ్య విడదీయని బంధం ఏర్పడిందని.. లవర్ పేరు పచ్చబొట్టు వేయించుకుంటారు. కానీ అది తరుచుగా పశ్చాత్తాపానికి దారితీస్తుంది. ఒక్కోసారి కప్పిపుచ్చుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు సెలబ్రిటీలు, ట్రెండ్, మీనింగ్, ఇంపార్టెన్స్ గురించి ఆలోచింకుండా ఫైనలైజ్ చేయొద్దు.

* టాటూ వేయించుకోవాలనే ఆలోచన రాగానే సరాసరి వెళ్లి ఇంక్ చేయించుకోకూడదు. ఎందుకంటే డిజైన్, ప్లేస్మెంట్ విషయంలో కళాకారుడు ఫెయిల్ అయితే బాధపడే చాన్స్ ఉంటుంది.

Next Story