Married Couple: కాసేపు కిస్, కాసేపు హగ్‌.. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే మీ భాగస్వామితో మీ లైఫ్‌ ఎంతో ఆనందం

by Vennela |

Married Couple: కొన్నిసార్లు భార్యాభర్తల(Married Couple) మధ్య అనుబంధం బాగానే ఉన్నా కుటుంబ విషయాల కారణంగా..ఆ బంధంలో తేడాలు వస్తుంటాయి.

Married Couple:  కాసేపు కిస్, కాసేపు హగ్‌.. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే మీ భాగస్వామితో మీ లైఫ్‌ ఎంతో ఆనందం
X

దిశ, వెబ్ డెస్క్: Married Couple: కొన్నిసార్లు భార్యాభర్తల(Married Couple) మధ్య అనుబంధం బాగానే ఉన్నా కుటుంబ విషయాల కారణంగా..ఆ బంధంలో తేడాలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితిలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకానీ గొడవలకు పోతే మాత్రం ఇద్దరి సంబంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే మీ భాగస్వామికి మీరెప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా. కనీసం హగ్ లేదా కిస్(Best Tips for a Happy Married Life) అయినా ఇచ్చారా. ఇవన్నీ ప్రేమికులు చేసుకుంటారు మాకెందుకు పెళ్లి అయ్యింది పిల్లలు ఉన్నారు అనుకుంటున్నారా. కానీ ఇలా అనుకోవడం తప్పే. ఎందుకంటే భార్యభర్తలిద్దరూ(Married Couple) అప్పుడప్పుడూ ఇలా గడిపితే వారి మధ్య బంధం మరింత పెరుగుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు ప్రేమను పంచుకోవడమే కాకుండా ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం, ఓదార్పునివ్వడం, సర్ ప్రైజ్ చేసుకోవాలని చెబుతున్నారు. వీటికి కొంచెం రొమాన్స్ జోడించారనుకోండి ఆ బంధంలో మధురానుభూతి మరింత పెరుగుతుంది. మరి అలా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐ లవ్ యూ అనేది ప్రేమికులు మాత్రమే చెప్పుకుంటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ భార్యాభర్తలు(Happy Married Life) కూడా ఐలవ్ యూ చెప్పుకోవాలంటున్నారు నిపుణులు. ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని కాదు. అలాని రోజూ చెప్పినా బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు విభిన్న రీతుల్లో వేర్వేరు భాషల్లో చెప్పడానికి ప్రయత్నించాలి. ఇది ఇద్దరికీ సరదాగా అనిపిస్తుంది. ఇక వాలెంటైన్స్ డే, పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనూ మీ భాగస్వామికి మంచి బహుమతి కొన్ని దాన్ని ఇస్తూ ఈ మాట చెప్పినట్లయితే మరింత సర్ ప్రైజింగ్ గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.




ఇక భార్య భర్తలు ఎంత ఆనందంగా ఉంటే ఆ కుటుంబం అంత హ్యాపీ(Happy Married Life) గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఇద్దరు కలిసి కాసేపు నవ్వుకోండి. సరదా ముచ్చట్లు పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. ఖాళీ సమయంలో దంపతులిద్దరూ కలిసినప్పుడు అనసవర ముచ్చట్లు కాకుండా జోక్స్, నవ్వు తెప్పించే చిన్నపాటి సంగతులు వంటివి షేర్ చేసుకోవాలి.





ఉదయం లేదంటే సాయంత్రం ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యేసి కాసేపు అలా నడుస్తూ రొమాంటిక్ వాక్ చేయడం మంచిది. సమయం దొరికినప్పుడల్లా వారిద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూస్తుండాలి. ఇలా వీలైనప్పుడు దంపతులిద్దరూ కలిసి రొమాంటిక్ గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.




నేటికాలంలో దంపతులిద్దరు(Happy Married Life) ఉద్యోగాలు చేస్తున్నవారు చాలా మందే ఉంటున్నారు. ప్రతిరోజూ ఎవరి పనులతో వారు బిజీగా గడుపుతుంటారు. ఒకరినొకరు పట్టించుకునేంత సమయం వారికి దొరకడం లేదు. సెలవు రోజునో బయటకు వెళ్లినప్పుడో లేదంటే ఏవైనా పండగలు ప్రత్యేక సందర్భాలప్పుడో ఒకరినొకరు ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రెడీ కావాలి. అక్కడితో ఆగకుండా ఆ క్షణం మీ భాగస్వామిపై మీకును్న ఫీలింగ్ వారితో చెప్పేయాలని. దగ్గరికి తీసుకుని లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ ప్రేమగా హత్తుకుంటూ రొమాంటిక్ గా మీ మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. ఈ చీరలో బాగున్నావ్ అంటే చాలు...అంతకంటే గొప్ప మాట ఇంకోటి ఉండదు.. ఈ డ్రెస్సులో మన్మథుడిలా ఉన్నావ్ అంటే హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇలా చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story