ఇండ్ల ధరలకు రెక్కలు.. యావరేజ్‌గా 6 % పెరిగే చాన్స్.. వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..!

by Javid Pasha |   (  Updated:2025-07-26 09:48:30  IST  )

ఇండ్ల ధరలకు రెక్కలు.. యావరేజ్‌గా 6 % పెరిగే చాన్స్.. వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..!

ఇండ్ల ధరలకు రెక్కలు.. యావరేజ్‌గా 6 % పెరిగే చాన్స్.. వాటికి మాత్రం ఫుల్ డిమాండ్..!
X

దిశ, బిజినెస్ బ్యూరో : వడ్డీ రేట్లు, ప్రీమియమైజేషన్ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని ఓ నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి ఉండే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ మహమ్మారి తర్వాత మూడేళ్లకు స్థిరాస్తి రంగంలో రికవరీ కనబడిందని, మళ్లీ ఇప్పుడు డిమాండ్ పుంజుకునే దశలో ఉందని నివేదిక అభిప్రాయపడింది. దీని ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే 2025-26లో ఇళ్ల అమ్మకాలు 10-12 శాతం పెరుగాయని అంచనా. డిమాండ్ కంటే అధికంగా సరఫరా అందుబాటులోకి వస్తుందని పలువురు రియల్టర్లు చెబుతున్నారు.

ఇన్వెంటరీలు పెరగడం, మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ కోసం డెవలపర్లు ఎక్కువ సంఖ్యలో ఇళ్లను డెలివరీ చేయవచ్చు. దీనివల్ల అమ్మకాలతో పాటు స్థిరాస్తి రంగంలో డిమాండ్ 5-7 శాతం, ధరలు 4.6 శాతం పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది. డిమాండ్‌తో పాటు నిర్మాణ వ్యయం పెరగడం ఇందుకు కారణం ప్రీమియం, లగ్జరీ ఇళ్లపై ఆసక్తి గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో అమ్మకాలు 26 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. డిమాండ్ కూడా 14 శాతం మేర పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గడంతో డిమాండ్ గతంలో కంటే పెరిగింది. ముఖ్యంగా ప్రీమియం, లగ్జరీ ఇళ్లపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో టాప్ 7 నగరాల్లో ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుంది. 2025, 2026లలో కొత్త లాంచ్‌ నిర్మాణాల్లో ప్రీమియం, లగ్జరీ విభాగాల వాటాయే 38–40 శాతం ఉండనున్నాయి.

Next Story