- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాస్ట్‌లీ అయిపోయిన ఇళ్ల నిర్మాణం.. మరీ ఇంత పెరిగితే ఎలా?
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే .. ఆ ఎఫెక్ట్ అన్ని రంగాలపైనా పడుతుంది. అన్ని రకాల ముడిసరుకుల ధరలు పెరుగుతాయి. కార్మికుడి కూలీ మొదలుకొని అన్ని ఖర్చులు పెరుగుతాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే .. ఆ ఎఫెక్ట్ అన్ని రంగాలపైనా పడుతుంది. అన్ని రకాల ముడిసరుకుల ధరలు పెరుగుతాయి. కార్మికుడి కూలీ మొదలుకొని అన్ని ఖర్చులు పెరుగుతాయి. అలాగే వీటి కారణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని జేఎల్ఎల్ అనే సంస్థ నివేదిక స్పష్టం చేస్తుంది. 2025 నవంబరులో కొత్త కార్మిక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులతో సహా పెరిగిన ముడి సరుకు ఖర్చులు 5–12% మేర పెరగవచ్చని అంచనా. 2026లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 3 నుంచి 5% మేర పెరిగే అవకాశం ఉందని నివేదిక చెప్తుంది. ప్రపంచ వ్యాప్త డిమాండ్, ఇతర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ ధరలు ఒకటి నుంచి రెండు శాతం, స్టీల్ ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరగనున్నాయి. డీజిల్ ధరలు 5 శాతం నుంచి 6 శాతం తగ్గాయి. కానీ అల్యూమినియం ధరలు 8 శాతం నుంచి 9 శాతం వరకు పెరగనున్నాయి. అలాగే కాపర్ ధరలు 9 శాతం నుంచి 10 శాతం వరకు గణనీయంగా పెరిగాయని జేఎల్ఎల్ వివరించింది. స్కిల్డ్ కార్మికుల కొరత, మౌలిక సదుపాయాల డిమాండ్ కారణంగా అన్ని విభాగాలలో కార్మిక వ్యయాలు 5 నుంచి 6% మేరకు పెరగొచ్చునని అంచనా. కాగా వీటన్నింటి కారణంగా ఇండ్ల ధరలు కూడా పెంచక తప్పని అనివార్యత ఏర్పడుతుంది.
జీఎస్టీ తగ్గినా
ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద సిమెంట్‌పై 10 శాతం టాక్స్ తగ్గించింది. ఇది డెవలపర్లకు ఉపశమనాన్ని కలిగించింది. కానీ 2025 నవంబర్‌లో అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టం, మెరుగైన సామాజిక భద్రతా ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణ కవరేజ్, ప్రామాణిక వేతన ఫ్రేమ్ వర్కులను తప్పనిసరి చేశారు. దీనివల్ల అన్ని నైపుణ్య విభాగాలలో కార్మిక వ్యయాలు 5 శాతం నుంచి 12 శాతం పెరుగుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం నిర్మాణ వ్యయాలు 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని.. ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చని జేఎల్ఎల్ ప్రకటించింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో చూస్తున్న తీరును అంచనా వేసి ఈ విషయాలను వెల్లడించారు.
ఖర్చు.. ఎక్కడ.. ఎంత..
ముంబై వంటి మహానగరంలో విలాసవంతమైన బహుళ అంతస్తుల భవనాలకు చదరపు అడుగుకు రూ. 4,600 నుంచి రూ. 5,200 ధర ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో చదరపు అడుగుకు రూ.4,200 - రూ. 4,800 వంతున లభిస్తున్నాయి. ఇది కేవలం ధరల వ్యత్యాసం మాత్రమే కాదు. మూల ధన కేటాయింపులను మౌలికంగా పునర్నిర్మిస్తోంది. టైర్-2 విస్తరణను ప్రోత్సహిస్తుంది. రియల్ ఎస్టేట్ భౌగోళిక స్వరూపాన్ని పునర్నిర్వచిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి.. ముందు చూపుతో వ్యవహరించాల్సిందే అంటున్నారు. అంటే మెట్రో సిటీల కంటే టైర్ 2 నగరాలను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని జేఎల్‌ఎల్, పీడీఎస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య దేశాయ్ అంటున్నారు. రక్షణ చర్యలు, స్కిల్డ్ లేబర్ కొరత, కఠినమైన పర్యావరణ ప్రమాణాల కారణంగా 2026లో నిర్మాణ వ్యయాలు 3-5% మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు.






