- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hormones : భావోద్వేగాల నియంత్రణలో హార్మోన్ల పాత్ర.. ఈ మార్పులకు అవే కారణం!
Hormones : భావోద్వేగాల నియంత్రణలో హార్మోన్ల పాత్ర.. ఈ మార్పులకు అవే కారణం!

దిశ, ఫీచర్స్ : మనుషుల్లో ప్రేమ, బాధ వంటి ప్రవర్తనలు కేవలం భావోద్వేగాలే కాదు, వాటిపై హర్మోన్ల ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి ప్రవర్తనలో, నియంత్రణలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తిలో ప్రేమలో ఉన్నప్పుడు, అలాగే బ్రేకప్ అయినప్పుడు, బాధలో మునిగిపోయినప్పుడు వాటిని శరీరంలో జరిగే పలు మార్పులకు ఇవి కారణం అవుతుంటాయి. అదెలాగో చూద్దాం.
*ఆక్సిటోసిన్ : ఒక వ్యక్తి మెదడులో ప్రేమ, భావోద్వేగాలు వంటి ఫీలింగ్స్ ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటిని మేనేజ్ చేయడంలో సహాయపడే హార్మోన్లలో ఆక్సిటోసిన్ ఒకటి. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. సంబంధాలు, ప్రేమ, నమ్మకం, గౌరవం, ఓపీనియన్ వంటి అంశాల్లో ఇది కీ రోల్ పోషిస్తుంది.
*డొపమైన్ : ఇది బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మనం ఇష్టపడే వ్యక్తులతో ఉన్నప్పుడు ఆనందాన్ని, భరోసాను, సురక్షిత భావాలను కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను దూరం చేస్తుంది.
*వాసోప్రెసిన్ : ఇష్టమైన వ్యక్తులపట్ల ఆసక్తిని క్రియేట్ చేయడంలో ప్రేరణగా నిలిచే హార్మోన్ వాసోప్రెసిన్. ఎగ్జైట్మెంట్ భావాలను, ప్రియమైన వారిపట్ల ప్రొటెక్షన్, లాయల్టీ వంటి ఫీలింగ్స్‌ను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అసూయ భావాలకు కూడా ఇదే కారణం అవుతుంది.
*టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్: ఈ హార్మోన్లను సెక్స్ హార్మోన్లు అని కూడా పిలుస్తారు. రిలేషన్‌షిప్‌లో కీలకపాత్ర పోషిస్తాయి. స్ట్రీ, పురుషుల మధ్య స్టార్టింగ్ స్టేజ్‌లో ఆకర్షణకు కారణం అవుతాయి. లైంగిక పరమైన కోరికలకు, భావాలకు ప్రేరణగా నిలుస్తాయి.
* నోరాడ్రినలిన్ : శరీరంలో జరిగే మార్పులకు, ప్రతిస్పందనలకు నోరాడ్రినలిన్ హార్మోన్ కీలకం. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతలకు చెమటలు పట్టడం, అత్యంత ఇష్టమైన వారిని కలిసినప్పుడు ఎనర్జిటిక్‌గా ఫీలవ్వడం వంటివి భావాలు ఈ హార్మోన్ విడుదల కారణంగా సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు.
*సెరోటోనిన్: రిలేషన్‌షిప్‌లో, ముఖ్యంగా అటాచ్‌మెంట్ ప్రవర్తనలో కీ రోల్ పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది తగ్గినప్పుడు.. నిర్లక్ష్య ధోరణి వంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. లో సెరోటోనిన్ లెవెల్స్ ఒక విధంగా అబ్సెసివ్ - కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కాకపోతే ఇవి సంబంధంలో మంచి విషయంగా ఉంటాయి. అంటే ఇద్దరూ తమ బంధానికి సంబంధించిన అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






