హనీమూన్ వెళ్లాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా 5 లక్షల విమాన టిక్కెట్లు

by Disha Web Desk 12 |
హనీమూన్ వెళ్లాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా 5 లక్షల విమాన టిక్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటక రంగంలో హాంకాంగ్.. కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ క్రమంలోనే హాంకాంగ్ తన గ్లోబల్ పబ్లిసిటీ ని మరింత పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ నగరానికి ఎక్కువ మంది సందర్శకులను తీసుకురావడానికి 5 లక్షల ఫ్రీ విమాన టికెట్లు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్యాథే పసిఫిక్ మరియు హెచ్‌కె ఎక్స్‌ప్రెస్‌తో సహా విమానయాన సంస్థలతో, అలాగే కొన్ని అంతర్జాతీయ పర్యాటక, ట్రావెల్ ఏజెన్సీల సహకారంతో ఈ ఫ్రీ విమాన టికెట్లు అందజేయనున్నట్లు సమాచారం అందుతుంది.

Read More: మానసిక ఒత్తిడిని దూరం చేసే ఆహారాలేవో తెలుసా !



Next Story