- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊపందుకున్న ఇండ్ల అమ్మకాల జోరు.. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
నగరాల వారీగా ఇళ్ల అమ్మకాల్ని పరిశీలిస్తే 24,706 యూనిట్ల విక్రయాలతో ముంబై టాప్ లో నిలిచింది. వార్షిక ప్రాతిపదికన ఇది 2 శాతం వృద్ధిగా ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఇళ్ల అమ్మకాలు 2025 మూడో త్రైమాసికంలోనూ జోరుగా ఉన్నాయి. ఎనిమిది ప్రధాన నగరాల్లో 87,603 యూనిట్ల మేరకు ఇండ్లు అమ్ముడుపోయినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో విక్రయాలతో పోలిస్తే ఒక శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో విక్రయాలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
నగరాల వారీగా ఇళ్ల అమ్మకాల్ని పరిశీలిస్తే 24,706 యూనిట్ల విక్రయాలతో ముంబై టాప్ లో నిలిచింది. వార్షిక ప్రాతిపదికన ఇది 2 శాతం వృద్ధిగా ఉంది. మొత్తం విక్రయాల్లో 28 శాతం వాటా చేజిక్కించుకుంది. చెన్నై ఏకంగా 12 శాతం వృద్ధితో 4,617 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ 12,955 యూనిట్లు, బెంగళూరు 14,538 యూనిట్లతో స్థిరమైన ప్రదర్శన కనబరిచాయి. పుణెలో మాత్రం అమ్మకాలు 8 శాతం మేర తగ్గాయి. భారతదేశ రెసిడెన్షియల్ మార్కెట్ తన ఊపును కొనసాగించిందని, ఫలితంగా వృద్ధి రేటు హేతుబద్ధీకరించడం ప్రారంభమైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు.






