- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నియోపొలిస్ జంక్షన్లకు నయా తేజ్..! సుందరీకరణకు ప్రతిపాదనలు రెడీ..
నియోపొలిస్ జంక్షన్లకు నయాతేజ్.. సుందరీకరణకు ప్రతిపాదనలు రెడీ..

దిశ, తెలంగాణ బ్యూరో : నియోపొలిస్ సెజ్ మెయిన్ గేట్ రోటరీ, నియోపొలీస్, మోకిలా రోడ్డు రెండు కూడళ్లను సుందరీకరించనున్నారు. ఇందుకు సత్వా గ్రూపు కంపెనీకి చెందిన ఎడెన్ బిల్డ్ కాన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా పనులు చేయడానికి అవకాశమివ్వాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు ప్రతిపాదనలు పంపించింది. జంక్షన్ల అభివృద్ధితోపాటు ఐదేండ్లపాటు నిర్వహణ సైతం సదరు సంస్థకే ఇవ్వనున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది.
సాంస్కృతిక శిల్పాలతో..
నియోపొలిస్ సెజ్ మెయిన్ గేట్ రోటరీతోపాటు మరో రెండు జంక్షన్లను మొదటగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సీఆర్ఎస్ మేసనరీ నిర్మాణాలతో అభివృద్ధి చేశారు. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ద్వారా గ్రీనరీ డెవలప్ చేశారు. అయితే సీఎస్ఆర్ కింద డెవలప్ చేస్తామని సత్వా గ్రూపు ముందుకు రావడంతో సదరు కంపెనీకే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో సత్వా గ్రూప్ మరింత అభివృద్ధి చేయనుంది. ఈ అందమైన అభివృద్ధిలో స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక శిల్పాలు, సౌందర్యాత్మక అంశాలు ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
పబ్లిక్ - ప్రయివేటు భాగస్వామ్యం
మూడు జంక్షన్లను సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి, నిర్వహణను ఐదు సంవత్సరాలపాటు పూర్తిగా చేయనున్నారు. ఈ నిర్వహణతో హెచ్ఎండీఏకు ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, ఇది ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని హెచ్ఎండీఏ కమిషనన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
హైరైజ్ బిల్డింగ్ లకు అడ్డా
నియోపొలిస్ ప్రాంతం రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కేంద్రంగా మారింది, అందులో అనేక పేరుగాంచిన డెవలపర్లు అత్యాధునిక హైరైజ్ భవనాలు, వాణిజ్య సంస్థలను నిర్మిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోని ముఖ్యమైన జంక్షన్ల అభివృద్ధి ద్వారా నివాసితులు, వ్యాపారులు, సందర్శకులకు మెరుగైన నగరంగా మారనుంది. దీంతో హైదరాబాద్ మహానగరంలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీతోపాటు నివాసయోగ్యమైన నగరంగా మారడానికి ఒక ముందడుగుగా చెప్పొచ్చని అధికారులు చెబుతున్నారు. నగరాభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలు చూపిస్తున్న సానుకూల పాత్రకు ఇది నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు.






