చీర్స్... డ్రింక్ చేసేటప్పుడు ఇలా ఎందుకు అంటారో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-10-24 08:08:28  IST  )

చీర్స్ (Cheer) అనే పదం వాస్తవానికి ‘చియర్’ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అసలైన అర్థం ఆనందం.

చీర్స్... డ్రింక్ చేసేటప్పుడు ఇలా ఎందుకు అంటారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: బర్త్ డే పార్టీ, బ్యాచిలర్ పార్టీ, లవ్ ఫెయిలైనా పార్టీ, సక్సెస్ అయినా పార్టీ, సంతోషం అనిపించినా పార్టీ, బాధగా కూరుకుపోయినా పార్టీ.. సందర్భమేదైతేనేం.. పార్టీ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిస్తే చాలు కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే డ్రింక్స్ తాగే ముందు చాలామంది సాధారణంగా సాధారణంగా చెప్పే మాట ‘చీర్స్’... అసలు ఇలా ఎందుకు అంటారనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా?, కానీ దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అర్థం ఇదే..

చీర్స్ (Cheer) అనే పదం వాస్తవానికి ‘చియర్’ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అసలైన అర్థం ఆనందం. పార్టీలు చేసుకునే సమయంలో అందరూ కలిసి ఇలా చీర్స్ చెప్పుకోవడంవల్ల ఆ పార్టిలో ఉత్సాహం పెరుగుతుందని అంటారు. ఈ కాలంలో మద్యం తాగడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. పైగా చాలా మంది ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేకుండానే ఎప్పుడు పడితే అప్పుడు మద్యం సేవిస్తున్నారు. అయితే ఈ మద్యపాన సంప్రదాయంలో చీర్స్ రావడం వెనుక మధ్య యుగం నాటి పరిస్థితులు కారణంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

‘చీర్స్’ వెనుక కథ..

ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. మధ్యయుగంలో దారి దోపిడి దొంగలు ఎక్కువగా ఉండేవారు. అయితే వీరు అందరూ కలిసి చేసిన దొంగతనం విజయవంతమైతే.. అందరూ ఒక దీవి వద్దకు చేరుకొని అక్కడ మద్యం సేవించేవారు. కాగా వారిలో కొందరు కలిసి దొంగతనం చేసిన మొత్తాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం మిగతావారి మద్యం గ్లాసులలో విషం కలిపే ప్రయత్నం చేసేవారట. ఈ ఆలోచనని తిప్పి కొట్టాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఒక నిర్ణయానికి మద్యంలో విషం లేదని, అందరం కలిసి తాగుతున్నామని తెలిపేందుకు అందరూ కలిసి ‘చీర్స్’ కొట్టేవారు. ఇదీ అసలు కథ. అయితే చీర్స్ కొడితే విషం పోతుందా? అంటే.. పోదు కానీ.. అందరూ మద్యాన్ని గ్లాసులలో కలుపుకొని చీర్స్ కొట్టడం వల్ల ఆ గ్లాసుల్లోని మద్యం ఒకదానికొకటి తగిలి, ఒకరి గ్లాసులోని మద్యం మరొకరి గ్లాసుల్లో పడుతుంది. ఇలా పడటం వల్ల.. ఎవరైనా విషం కలిపితే అందరూ చనిపోతారని భయపడి ఎవ్వరూ విషం కలపకుండా ఉండేవారు. అది కాస్త కాలక్రమంలో దేశ విదేశాలకు వ్యాపించింది.

Next Story