- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నీలో తలనొప్పి, వాంతింగ్స్.. తక్షణమే నివారించే చిట్కాలివిగో..!
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఫుల్లుగా ఉంటాయి. పైగా వాంతులు, అజీర్తి, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జర్నీ సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : ప్రయాణాలు చేయడమంటే కొందరికి మహా సరదా.. ట్రైన్‌లోనో, బస్సులోనో వెళ్తున్నప్పుడు కిటీకీ వద్ద కూర్చొని బయటి పరిసరాలను ఆస్వాదిస్తుంటారు. మరి కొందరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటేనే భయపడుతుంటారు. ఎందుకంటే.. ట్రైన్ లేదా బస్సు వంటివి కదులుతున్నప్పుడు వీరికి కళ్లు తిరుగుతాయి. వికారం, తలనొప్పి వేధిస్తాయి. వాంతులు కూడా అవుతుంటాయి. పలువురికి ఫీవర్ కూడా వస్తుంది. ఈ సమస్య పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జర్నీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకూడదంటే ఆయుర్వేదిక్ నిపుణులు, పెద్దల ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
*నిమ్మకాయ, పుదీనా జ్యూస్ : ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వికారం, వాంతింగ్స్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం ఉన్నవారు మీతోపాటు ఒక నిమ్మకాయ లేదా నిమ్మకాయ రసం తీసుకెళ్లండి. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వాసన చూడటం, రసం తాగడం వల్ల జర్నీ చేస్తున్నప్పుడు వచ్చే అలసట, వికారం, వాంతులు, తలనొప్పి తగ్గిపోతాయి. తక్షణ శక్తిని అందించి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. పుదీనాలో కూడా ఇటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి పుదీనా ఆకులతో చేసిన జ్యూస్ కూడా జర్నీలో ఇబ్బందులను నివారిస్తుంది.
*అల్లం, తులసీ ఆకులు : అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఫుల్లుగా ఉంటాయి. పైగా వాంతులు, అజీర్తి, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే జర్నీలో ఇబ్బంది పడేవారు ఒక అల్లం ముక్కను వెంట తీసుకెళ్లడం బెటర్ అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. దాని వాసనకు వాంతులు రాకుండా ఉంటాయి. అలాగే అల్లం ముక్కను చక్కెరలో కలిపి తింటే కూడా వాంతులు, వికారం, గ్యాస్ట్రిస్, సిక్‌నెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరెంజ్ మిఠాయి, లవంగాలు కూడా జర్నీ సిక్‌నెస్‌ను దూరం చేస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.






