- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health&Fitness: వ్యాయామాల్లో కొత్త ట్రెండ్ .. జోన్ జీరో !
ఫిట్‌నెస్ ప్రతిరోజూ గ్రౌండ్‌కో, జిమ్‌కో వెళ్లాల్సిన పనిలేదు. వందల మీటర్లు పరుగెత్తాల్సిన అవసరం కూడా లేదు. ‘జోన్ జీరో ట్రెండ్’ ఫాలో అయితే చాలు.

దిశ, ఫీచర్స్ : అసలే బిజీ లైఫ్ షెడ్యూల్.. వ్యాయామాలు చేసే సమయం మీకు ఉండట్లేదా? సమ్మర్‌లో ఔట్‌డోర్ వ్యాయామాలు ఇబ్బందిగా ఉంటున్నాయా.. డోంట్ వర్రీ.. ‘జోన్ జీరో ట్రెండ్’ ఫాలో అయితే చాలు.. మీ ఫిట్‌నెస్‌ను, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది దీనిని అనుసరిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ జోన్ జీరో, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఎలా చేయాలి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జోన్ జీరో వ్యాయామం కోసం మీరు గ్రౌండ్‌కో, జిమ్‌కో వెళ్లాల్సిన పనిలేదు. వందల మీటర్లు పరుగెత్తాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నిలబడటం, స్ట్రెచింగ్ చేయడం, సాధారణ కదలికల ద్వారానే అవసరమైన వ్యాయామం పూర్తి చేయడం ఇందులో భాగమని ఫిట్‌నెస్ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ఇది సాధారణ వ్యాయామంలా కాకుండా.. తక్కువ ఇంటెన్సిటీ యాక్టివిటీస్‌పై ఆధారపడుతుందని చెబుతున్నారు. ఇది గరిష్ట హార్ట్ రేట్‌లో 50% లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే శారీరక కదలికలకు దోహదం చేస్తూ, శరీరానికి చెమటలు పట్టకుండానే ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అంటున్నారు.
కదలికలతోనే ఆరోగ్యం..
నిజానికి జోన్ జీరో వ్యాయామం అంటే వాకింగ్ కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండే జోన్ అని చెప్పవచ్చు. అంటే తక్కువ శ్రమతోనే రోజువారీ సాధారణ కదలికలను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ శ్రమ పడకుండా, ఇంటెన్స్ ఫీలింగ్ లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఎవరైనా సులభంగా చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు సాధారణ నడక లేదా స్ట్రోలింగ్ (Light walking or strolling), వాకిట్లోనే వాకింగ్ చేయడం, షాపింగ్‌కి నడుచుకుంటూ వెళ్లిరావడం, బట్టలు ఉతకడం, ఇండ్లు సర్దడం, తుడవడం, చెట్లకు నీళ్లు పట్టడం, స్ట్రెచింగ్, లాండ్రీ చేస్తున్నప్పుడు స్క్వాట్స్ వంటి లైట్ యాక్టివిటీలన్నీ జోన్ జీరో కిందికే వస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. వృద్ధులు, కండరాల బలహీనత కలిగినవారు కూడా జోన్ జీరో వ్యాయామాలు చేయడం చాలా సులభం.
ప్రయోజనాలు ఏమిటి?
శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంలో జోన్ జీరో వ్యాయామం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. బ్లడ్ షుగర్‌ను రెగ్యులేట్ చేసి, భోజనం తర్వాత గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గించడం ద్వారా ఇన్సులిన్ సమస్యలకు చెక్ పెట్టడంలోనూ ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను నివారిస్తుంది. లాన్సెట్ రివ్యూ వంటి రీసెర్చ్ స్టడీలు సైతం జోన్ జీరో పరిధిలోకి వచ్చే రోజువారీ సాధారణ నడక కూడా ఎర్లీ డెత్ రిస్క్‌ను తగ్గిస్తుందని పేర్కొంటున్నాయి. వృద్ధులు, కండరాల బలహీనత కలిగినవారు కూడా వీటిని సులభంగా చేయవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






