- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాలెంటైన్స్ డే జరుపుకోనివారే ఎక్కువ సంతోషంగా ఉంటారు..! అధ్యయనాలు చెప్పే వాస్తవాలివే..
వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఉద్దేశ పూర్వకంగా స్కిప్ చేయడం నిజమైన, ప్రశాంతమైన ప్రేమ భావనకు దారితీస్తుందని అనేకమంది జంటలు అభిప్రాయపడుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వస్తోందిక అన్నట్లు రేపటి వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు కొందరు. అసలీ ప్రేమికుల రోజు ఎందుకు వస్తోందిరా బాబూ తొక్కలోది! అని అసహ్యించుకుంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా ప్రతీ విషయంలో నెగెటివ్, పాజిటివ్ కోణాలు ఉంటాయి. లేకపోయినా వెతికి మరీ వెలికితీయడం కూడా మానవ సహజం కదా!. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే కూడా అంతే. ప్రేమ మధురమైందని, మైమరిపిస్తుందని కొందరు మురిసిపోతే.. ప్రేమ బాధిస్తుందని, వేధిస్తుందని, నరకం చూపిస్తుందని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే వాలెంటైన్స్ డే జరుపుకునేవారికంటే.. జరుపుకోని వారు సంతోషంగా ఉంటారని కూడా కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. అదెలాగో చూద్దాం పదండి!
ఏది ప్రేమ?
ప్రేమ హృదయాంతరాల్లోంచి పుట్టుకొస్తుంది. అది ఎప్పటికీ ఉంటుంది. దానిని ప్రపంచానికి ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదని అనేకమంది పేర్కొన్నట్లు OkCupid, eHarmony, Facebook Data Science (2018)& Match.com అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక్క వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసున్నంత మాత్రాన నిజమైన ప్రేమగా భావించాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. అలాగనీ వాలెంటైన్స్ డేని జరుపుకోవడం మీ సంబంధం బలహీనంగా ఉందనే సూచన కూడా ఏమాత్రం కాదని చెబుతున్నాయి. వాస్తవానికి సంతోషంగా ఉన్న జంటలు ఫిబ్రవరి 14ని ఉద్దేశపూర్వకంగా స్కిప్ చేస్తుంటారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు కృత్రిమ ఒత్తిడి(Artificial stress), బలవంతపు రొమాన్స్(Compelling romance), ఖరీదైన గిఫ్ట్‌లు, డిన్నర్‌లకు సంబంధించినకమర్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ వీరికి అవసరం లేదు.
బలమా.. బలహీనతా?
వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఉద్దేశ పూర్వకంగా స్కిప్ చేయడం నిజమైన, ప్రశాంతమైన ప్రేమ భావనకు దారితీస్తుందని అనేకమంది జంటలు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. బదులుగా ఈ కోవకు చెందిన ‘మైక్రో-రొమాన్స్’ అనే చిన్న చిన్న ప్రేమ చర్యలపై (small acts of love) దృష్టి పెడతారు. రోజువారీ దయ(daily grace), కృతజ్ఞత, కలిసి సమయాన్ని గడపడం వంటి చిన్న సర్‌ప్రైజ్‌లు.. వారిలో ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే ఇవి ఒక్క రోజు గ్రాండ్ జెస్చర్(grand gesture) కంటే ఎక్కువగా లాంగ్‌టెర్మ్ సంతృప్తిని ఇస్తాయి. అలాగనీ.. వాలెంటైన్స్ డే బ్రేకప్‌లకో, బలహీన బంధాలకో కారణం కాదు కానీ.. కేవలం ఇప్పటికే బలహీనంగా ఉన్న సంబంధాలను బయటపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రేకప్‌లకు దారితీసే రోజు కూడా..
అధ్యయనాల ప్రకారం కూడా వాలెంటైన్స్ డే సమయంలోనే 15–20% జంటలు బ్రేకప్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వారి మధ్య ఇప్పటికే ఎమోషనల్ డిస్టెన్స్, పరస్పర అవగాహనా లోపం, అతి అంచనాలు, అనాలోచిత నిర్ణయాలు వంటివి కలిగిన జంటల్లోనే ఇలా జరుగుతాయి. అయితే ఆరోగ్యకరమైన, సురక్షితమైన సంబంధాలు అలా కాదు. అవి కేవలం వాలెంటైన్స్ డే ఒత్తిడిని, ఎమోషనల్ సిట్యువేషన్స్ బట్టి ప్రభావితం కావు. కాబట్టి నిజమైన ప్రేమకు “ప్రూఫ్ డే” అవసరం లేకుండానే ఒకరినొకరు సురక్షితంగా, సంతోషంగా భావిస్తారు. కాబట్టి ట్రూ లవ్ ఒక్క ఫిబ్రవరి 14 అనే ఒక్క క్యాలెండర్ తేదీపై ఆధారపడదు. అన్ ఎక్స్‌పెక్టెడ్ సర్‌ప్రైజ్‌లు, ఖరీదైన గిఫ్టులు వీరికి అవసరం లేదు. గుండె నిండా నిజమైన ప్రేమ ఉంటే చాలు అంటున్నారు అధ్యయనాలను ఎనలైజ్ చేసిన నిపుణులు. పైగా దానిని వాలెంటైన్స్ డే రోజే అనవసర ఒత్తిడికి గురవుతూ ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదని అత్యధికమంది భావిస్తున్నారు. సో.. వాలెంటైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక సందర్భమే తప్ప.. అది జరుపుకుంటేనే నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదని యువతీ యువకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






