Emojis : ఛాటింగ్‌లో అది చెప్పడానికి టైపింగే చేయాల్సిన అవసరం లేదు.. సింబల్ జోడించినా అర్థమైపోద్ది..!!

by Javid Pasha |

Emojis : ఛాటింగ్‌లో అది చెప్పడానికి టైపింగే చేయాల్సిన అవసరం లేదు.. సింబల్ జోడించినా అర్థమైపోద్ది..!!

Emojis : ఛాటింగ్‌లో అది చెప్పడానికి టైపింగే చేయాల్సిన అవసరం లేదు.. సింబల్ జోడించినా  అర్థమైపోద్ది..!!
X

దిశ, ఫీచర్స్ : వంద పదాల్లో చెప్పలేని భావాన్ని సైతం ఒకానొక చిత్రం ద్వారా తెలియజేయవచ్చు అంటారు చిత్రకారులు. అయితే ఆధునిక సాంకేతిక కాలంలో ఆ స్థానాన్ని ఎమోజీలు కూడా భర్తీ చేస్తున్నాయి. ఫోన్‌లోనో, క్రోమ్ బుక్‌లోనో(Chromebook) ఫ్రెండ్స్‌తో ఛాట్ చేస్తున్నప్పుడు పేరాలకొద్దీ టెక్ట్స్ రాయడానికి ఈ జనరేషన్ ఇంట్రెస్ట్ చూపడం లేదు. తమ ఫీలింగ్స్‌, ఎమోషన్స్.. లోతైన భావాలు ఏవైనా వాటిని వంటివి వ్యక్తం చేయడానికి షార్ట్‌కట్స్, ముఖ్యంగా ఎమోజీలను(Emojis)ను వాడేస్తున్నారు యువతీ యువకులు. అయితే క్రోమ్‌బుక్‌లో వీటికి వేర్వేరు షార్ట్‌కట్స్ కూడా ఉంటాయి. కాబట్టి నిపుణుల ప్రకారం.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షరాలకి బదులు సింబల్స్

క్రోమ్ బుక్, వాట్సాప్ డివైజ్ ఏదైనా కానీ.. ఈ రోజుల్లో ఛాట్ చేయనివారంటూ దాదాపు ఉండరు. పైగా చాలా మంది ఫుల్లుగా ఎమోజీలు వినియోగిస్తుంటారు. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా టెక్ట్స్ రూపంలో ఛాట్ చేసేంత సమయం లేక ఎమోజీస్‌నే ఆశ్రయిస్తుంటారు అనేకమంది. ఉదాహరణకు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని అక్షరాల్లో రాసే బదులు జస్ట్ లవ్ సింబల్ ఎమోజీని సెండ్ చేస్తే చాలు. అవతలి వ్యక్తికి అర్థమైపోతుంది.

వ్యక్తీకరణ మార్గాలు

క్రోమ్ బుక్(Chromebook)లో ఎమోజీలను ఉపయోగించడం చాలా ఈజీ అండ్ ఫన్నీ ప్రాసెస్ అనే చెప్పాలి. ఇది టెక్ట్స్ మెసేజెస్, ఈ మెయిల్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్‌లలో తమ ఎక్స్‌ప్రెషన్స్‌(expression)ను పాఠకులకు సహాయపడుతుంది. అయితే Chromebook ఆపరేటింగ్ సిస్టమ్ (Chrome OS)లో ఎమోజీలను యాక్సెస్ చేయడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆన్-స్క్రీన్ కీబోర్డ్(On-screen keyboard) లేదా కీబోర్డ్ షార్ట్‌కట్‌ల ద్వారా అయితే.. రెండవది ఫిజికల్ కీ బోర్డ్ ఉపయోగించడం.

ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌

మీరు Chromebook యూజర్స్ అయితే ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌ను ఓపెన్ చేయడానికి, టచ్‌స్క్రీన్ ఉన్న క్రోమ్‌బుక్‌లో టెక్స్ట్(Text) ఫీల్డ్‌ను టచ్‌చేసి(Touch the field), కీబోర్డ్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అక్కడి నుండి, స్మైలీ ఫేస్ లేదా ఎమోజీ ఐకాన్‌ను ఎంచుకోవడం(choosing) ద్వారా వివిధ ఎమోజీలను బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మెథడ చాలా సింపుల్. అంతేకాకుండా టచ్‌స్క్రీన్(touchscreen) యూజర్లకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

ఫిజికల్ కీబోర్డ్

ఇక ఫిజికల్ కీ బోర్డ్ వినియోగదారులు క్రోమ్‌బుక్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌ఫ్రెషన్స్‌కు సంబంధించిన ఎమోజీలను ఓపెన్ చేయడానికి Search + Shift + Space (లేదా కొన్ని మోడల్స్‌లో Alt + Shift + Space) కీలను ఒకేసారి క్లిక్ చేయవచ్చు. ఇలా చేస్తే ఎమోజీ పికర్ (emoji picker) ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్మైలీలు, జంతువులు, ఆహారం వంటి వివిధ కేటగిరీల నుంచి ఎమోజీలను ఎంచుకోవచ్చు. అదనంగా టెక్స్ట్ ఆధారిత(Text based) ఎమోజీలను టైప్ చేయడానికి మీరు కోలన్ (:) తర్వాత ఎమోజీ పేరును టైప్ చేయవచ్చు. (ఉదాహరణకు, ‘‘:smile:’’ అని టైప్ చేస్తే 😊 కనిపిస్తుంది). కొన్ని అప్లికేషన్స్ లేదా వెబ్‌సైట్‌లలో (Google Docs, X (Twitter) వంటివి) ఎమోజీలను నేరుగా ఇన్సర్ట్ చేయడానికి అంతర్నిర్మిత ఎమోజీ మెనూలు(Built-in emoji menus) కూడా ఉంటాయి.

క్రోమ్‌బుక్ (Chromebook) యూజర్స్ ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌, ఫజికిల్ కీ బోర్డ్ ఈ రెండు మెథడ్స్‌తోపాటు Google Play Store నుంచి సురక్షితమైన థర్ట్ పార్టీ యాప్స్ లేదా ఎక్స్‌టెన్షన్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణఖు Gboard (Google Keyboard) వంటి యాప్‌లు ఎమోజీలను ఈజీగా ఇన్‌పుట్ చేయడానికి అడిషనల్ ఫీచర్స్‌ను అందిస్తాయి. దీంతో మీ రాతలకు, సందేశాలకు మరింత క్రియేటివిటీని జోడించే అవకాశం ఉంటుంది.

Next Story