- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూ ఇయర్ వేడుకలు నాడు.. నేడు : ఎమోషన్ vs ఎగ్జైట్‌మెంట్!!
న్యూ ఇయర్ వేడుకలంటే ఓ వైపు సంతోషంగా అనిపించినా, మరోవైపు ఆ రోజు ఏం ఘోరాలు జరుగుతాయోననే భయాలు కూడా వెంటాడుతున్న పరిస్థితులు నేడు నెలకొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఈసారి కూడా న్యూ ఇయర్ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే సంబురాల్లో మునిగితేలుతున్నారు. పబ్బులు, క్లబ్బులు, పార్టీలు, డ్యాన్సులు ఆధునిక యువతకు షరా మామూలే. ఒక విధంగా చెప్పాలంటే డ్రింక్ చేయడమే అసలైన సెలబ్రేషన్ అన్నంతగా పరిస్థితులు మారిపోయాయని 90s కిడ్స్ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో వెలితి వెంటాడుతోందని, నాటి కొత్త సంవత్సర వేడుకల జ్ఞాపకాలు కళ్లముందు సుడులు తిరుతున్నాయని గుర్తు చేసుకుంటున్నారు. ఎంత తేడా..! నాటికి.. నేటికి!
అప్పట్లో ఇలా
కొత్త సంవత్సరమంటే.. ఇప్పటి లెక్క తాగుడు, ఊగుడు కాదు. అప్పట్లో అదొక మధురానుభూతి. మనసులో ఏదో ఆనందం. వారం రోజుల ముందు నుంచే బంధువులకు, స్నేహితులకు ఇవ్వడానికి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కునేవాళ్లం. పెన్నులతో, రంగు పెన్సిళ్లతో హ్యాండ్ రైటింగ్‌తో కొటేషన్లు, కవితలు రాసి శుభాకాంక్షలు చెప్పేవాళ్లం. దగ్గరగా ఉండేవాళ్లకు, స్కూళ్లల్లో, కాలేజీల్లో దోస్తులకు, టీచర్లకు స్వయంగా కలిసి గ్రీటింగ్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేవాళ్లం. వేరే ఊర్లల్లో ఉండే వారికి, బంధువులకు పోస్టాఫీసు ద్వారా వారం ముందే గ్రీటింగ్స్ పంపేది. అలా పంపడం, అవతలి వారు కూడా తిరిగి ఉత్తరాలు, గ్రీటింగ్స్ పంపడం బంధాలను బలోపేతం చేసినట్లు అనిపించేది అంటున్నారు నిపుణులు. ఇక అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్‌కి, అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్‌కి గ్రీటింగ్ ఇవ్వడానికి అయితే తెగ నానా తంటాలు పడేది. కానీ అందులో ఆప్యాయత, ఆనందం నిండుగా ఉండేది.
ఫ్యామిలీ ఓరియెంటెడ్‌కే ప్రయారిటీ
అప్పట్లో ప్రేమలు చాలా రహస్యం. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని పుస్తకమో, నోట్ బుక్కో అడగడానికో, తీసుకోవడానికో అన్నట్లు వెళ్లి ఇష్టమైన వాళ్లకు లవ్ కొటేషన్లతో కూడిన గ్రీటింగ్స్ ఇచ్చేదని 90 కిడ్స్ గుర్తు చేస్తున్నారు. ఇక వేడుకల విషయానికి వస్తే కొత్త ఏడాది రోజు ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకోవడం, గుడికెళ్లి పూజలు చేసుకోవడం, కుటుంబంతో కలిసి సంతోషంగా ఇంట్లోనే గడపడం ఓ మధురమైన జ్ఞాపకమని 90 కిడ్స్ అంటున్నారు. వేడుకలన్నీ చాలా సరళంగా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండేవి. స్వీట్లు, నచ్చిన వంటకాలు ఇంట్లోనే తయారు చేసుకునేవారే ఎక్కువ. బంధువులు, కుటుంబంతో కలిసి భోజనం చేయడం, ఇంట్లోనే టీవీలో సినిమాలు చూడటం చేసేవారు. మద్యం అలవాటు ఉన్నప్పటికీ అప్పట్లో పురుషులు సాటు మాటుగానే తాగి ఇంటికొచ్చేవారు. తప్ప పార్టీల పేరుతో వృథా ఖర్చు చేయకపోయేది. ఇక ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద సిటీల్లో, ఫైవ్-స్టార్ హోటల్స్‌లో మాత్రమే థీమ్డ్ పార్టీలు జరిగేవి. అయితే అవి కూడా ఎలైట్ పీపుల్స్‌కే పరిమితమయ్యేవి. మిడిల్ క్లాస్, లో క్లాస్ ప్రజలు ఇంట్లోనే జరుపుకునేది.
నేడు డీజేలు, డిజిటల్ మెసేజ్‌లు
నేడు (2020లు-2025) న్యూ ఇయర్ వేడుకలంటే ఓ వైపు సంతోషంగా అనిపించినా, మరోవైపు ఆ రోజు ఏం ఘోరాలు జరుగుతాయోననే భయాలు కూడా వెంటాడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రాండ్ పార్టీలు, క్లబ్స్, రూఫ్‌టాప్ లాంజ్‌లు, బీచ్ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీలు, ముంబై మెరైన్ డ్రైవ్, ఢిల్లీ కానాట్ ప్లేస్ వంటి ప్లేసెస్‌లో పబ్లిక్ ఫైర్‌వర్క్స్, లైవ్ కాన్సర్ట్స్ వంటివి జరుగుతుంటాయి. యూత్ క్లబ్బింగ్, డీజే నైట్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఫ్యామిలీలు కూడా హోటల్ డిన్నర్స్,మాల్స్‌లో, ఈవెంట్స్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక పార్టీల పేరుతో 31 నైట్ పీకలదాకా తాగడం, డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడటం, గొడవల్లో తలదూర్చడం, గొడవకు దిగడం వంటి సంఘటనలు తరచూ ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇక గ్రీటింగ్స్ విషయానికి వస్తే ప్రత్యక్ష పలకరింపులకంటే కూడా డిజిటల్ పరంగానే ఎక్కువ. WhatsApp, Instagram, Facebookలో GIFలు, వీడియో మెసేజెస్, e-కార్డ్స్ వంటివి పంపడం, షేర్ చేయడం ద్వారా విషెస్ చెప్పుకుంటారు. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న ఎమోషనల్, పర్సనల్ టచ్, ఆనందం, నేటి వేడుకల్లో కరువైందని 90 కిడ్స్ అభిప్రాయడుతున్నారు.






