- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వారాలపాటు ఇంటర్నెట్ వాడకపోతే.. మీ జీవితంలో వచ్చే మార్పులివే..!
రెండు వారాల పాటు మొబైల్ ఇంటర్నెట్ వినియోగించిన వారితో పోలిస్తే.. వినియోగించని వారిలో అనేక సానుకూల మార్పులు కనిపించాయని పరిశోధకులు నిర్ధారించారు.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత తెచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఇంటర్నెట్ వినియోగం ఒకటి. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని వినియోగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నెట్ లేదా వైఫై వాడకం జీవితంలో ఒక భాగమైపోయింది. అదే సందర్భంలో అధిక వాడకం పలు సమస్యలకు సైతం దారితీస్తోంది. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాబట్టి అతివాడకం అనర్థదాయకమని, నెట్ వినియోగంలోనూ లిమిటేషన్స్ అవసరమని, డిజిటల్ డిటాక్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రెండువారాలపాటు ఇంటర్నెట్ వినియోగించకపోతే మనిషి జీవితంలో, ప్రవర్తలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. PNAS Nexus జర్నల్ ఇవి పబ్లిషయ్యాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.
అధ్యయనం జరిగిన తీరు..
అధ్యయనంలో భాగంగా పరిశోధకుడు ఆడ్రియన్ ఎఫ్. వార్డ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు 32 సంవత్సరాల లోపు వయసుగల 467 మందిని 4 వారాలపాటు స్టడీ చేశారు. కాగా ఈ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్‌లో పాల్గొనేవారు తమ స్మార్ట్‌ఫోన్‌లలో మొబైల్ ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసుకోవాలని సూచించిన పరిశోధకులు కాల్స్ అండ్ టెక్స్ట్ మెసేజ్‌లు అనుమతించారు. అలాగే డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అనుమతించారు. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ వినియోగం మానసిక పనితీరుపై చూపిన ప్రభావాన్ని పరిశీలించారు.
రెండు వారాలు దూరంగా ఉంటే..
రెండు వారాల పాటు మొబైల్ ఇంటర్నెట్ బ్లాక్ చేసిన తర్వాత.. ఇంటర్నెట్ వినియోగించేవారితో పోలిస్తే అనేక సానుకూల మార్పులు కనిపించాయని పరిశోధకులు నిర్ధారించారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, జీవిత సంతృప్తి, సానుకూల భావాలు(Subjective well-being), దీర్ఘకాలిక దృష్టి(Sustained attention)లో మెరుగుదల కనిపించింది. విషయాలపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరిగాయి. అదే విధంగా ఇంటర్నెట్ వినియోగించని వారు, మిగతావారితో పోలిస్తే దాదాపు 10 సంవత్సరాల చిన్న వయసుగల వారీగా అనిపించారు.
91% మందిలో ప్రయోజనాలివే..
మొత్తానికి నెట్ వినియోగించకపోవడం యాంటీడిప్రెసెంట్ మందుల ప్రభావానికి సమానంగా ఉందని, ఇది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలను సైతం దూరం చేసిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్ వినియోగించనివారిలో 91% మంది కనీసం ఒక అంశంలో మెరుగుదల అనుభవించారు. పైగా వీరు ఎక్కువ సమయం పర్సనల్ సోషలైజేషన్ కోసం, వ్యాయామం కోసం, ప్రకృతిలో గడిపేందుకు కేటాయించారు. ఇవన్నీ వారిలో మానసిక, శారీరక ఆరోగ్యాలను మరింత మెరుగు పరిచాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. కానీ పరిమితికి మించి వాడితే నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవసరం మేరకు వాడితే ఆరోగ్యం ఉంటారు. ఈ అలవాటు జీవన కాల పరిమితిని పెంచుతుంది. కాబట్టి డిజిటల్ డిటాక్స్ అవసరం.
Read More..






