- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చికపై చెప్పుల్లేకుండా నడిస్తే.. మీలో కనిపించే మార్పులివే..!
గరిక, నేల, ఇసుక వంటి సహజ ఉపరితలాలపై నడిచినప్పుడు భూమి నుంచి ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది.

దిశ, ఫీచర్స్ : పొద్దు పొద్దున్న వాకింగ్ చేస్తున్నప్పుడో, పొలానికి వెళ్లినప్పుడో చెప్పుల్లేకుండా పచ్చిక బయళ్లలో నడిచిన(Barefoot walking) అనుభవం మీకుందా? ఎందుకంటే ఈ విధమైన నడక మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిన్న తరహా ఆధునిక అధ్యయనాలు సైతం చెప్పుల్లేకుండా చేసే గ్రౌండ్ వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన, ఇన్‌ఫ్లమేషన్ వంటివి తగ్గుతాయని పేర్కొన్నాయి. 2015లో Journal of Inflammation Researchలోనూ ఈ వివరాలు పబ్లిష్ అయ్యాయి. ఇంతకీ చెప్పుల్లేని గ్రౌండ్ వాకింగ్ లేదా ఎర్థింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి!
నాడీ వ్యవస్థలో మార్పులు
చెప్పులు లేకుండా సాధారణ నేలపైగానీ పచ్చటి గడ్డిపై గానీ నడవడం వల్ల శరీరానికి సహజ సిద్ధమైన ఎనర్జీ లభిస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. గరిక, నేల, ఇసుక వంటి ప్రకృతి సిద్ధమైన సహజ ఉపరితలాలపై బేర్‌ఫుట్‌గా నడిచినప్పుడు, భూమి నుంచి ఎలక్ట్రాన్లు (negative charge) శరీరంలోకి ప్రవేశిస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ (positive charge)ని న్యూట్రలైజ్ చేసి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా పచ్చిక బయళ్లలో చెప్పులు లేకుండా నడక కొనసాగించడంవల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంట) తగ్గడం, నాడీ వ్యవస్థలో బ్యాలెన్స్ మెరుగ పడటం, స్ట్రెస్ రిడక్షన్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.
నొప్పి నుంచి ఉపశమనం
కొన్ని చిన్న స్కేల్ స్టడీస్ (ఉదా : Journal of Inflammation Research, 2015; PMC అధ్యయనాలు) ప్రకరాం కూడా.. గ్రౌండింగ్ వల్ల శరీరంలో నొప్పికి సంబంధించిన మార్కర్లు తగ్గుతాయని, దీంతో నొప్పి తగ్గడం, కార్టిసాల్ నార్మలైజ్ అవడం జరుగుతుందని తేలింది. అంతేకాకుండా స్లీప్ క్వాలిటీ మెరుగు పడటం కనిపించింది. ఉదాహరణకు గడ్డినేలపై నడిచిన వారిలో రాత్రిళ్లు ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ తక్కువగా ఉండటం, రెస్టోరేటివ్ స్లీప్ మెరుగుపడటం వంటివి పరిశోధకులు గుర్తించారు. ఇది నాడీ వ్యవస్థను పారాసింపథెటిక్ మోడ్‌కి (Rest and digest) మార్చి, ఓవరాల్ వెల్- బీయింగ్‌కి సహాయపడుతుందని కొందరు రీసెర్చర్లు అంటున్నారు.
డిప్రెషన్ దూరం..
రెగ్యులర్‌గా బయట పచ్చిక బయళ్లలో లేదా అడవిలో లేదా పార్కులో చెప్పులు లేకుండా 15 నుంచి 30 నిమిషాలు నడవడమనే సింపుల్ అండ్ ఫ్రీ మెథడ్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. సైంటిఫిక్‌గా ఇది పూర్తిస్థాయి ప్రూవెన్ మెడికల్ ట్రీట్మెంట్ అయితే కాదు కానీ.. ఆయుర్వేదం ప్రకారం.. అనుభవజ్ఞుల ప్రకారం చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గరికపై నడవడం ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. మానసిక ఆనందాన్ని కలిగించడం ద్వారా మొత్తం ఆరోగ్యాకి మేలు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నేచర్‌తో కనెక్ట్ అవ్వడం లాంటిదే ఇది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






