- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి కుండలో ఆరోగ్య రహస్యం.. నీరు తాగితే జరిగే అద్భుతాలివే!
మట్టి సహజంగానే ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి మట్టి కుండలోని నీరు శరీరంలో ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఇప్పుడంటే దాదాపు ప్రతీ ఇంటిలో ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. ఆహార పదార్థాలు, పానీయాలు చల్లగా ఉండేందుకు వీటిలో భద్రపరుస్తుంటారు. కానీ ఒకప్పుడు చల్లటి నీళ్లు తాగాలంటే మట్టి కుండలనే ఉపయోగించేవారు. ఇప్పటికీ కొందరు వీటిని ఉపయోగిస్తున్నారు కానీ.. చాలా తక్కువ. గ్రామాల్లో నివసించేవారు, ఫ్రిజ్ కొనే ఆర్థిక స్థోమతలేనివారు ఎండాకాలం వచ్చిందంటే చల్లటి నీటికోసం ఇప్పటికీ మట్టి కుండనే ఉపయోగిస్తుంటారు. అయితే ఇది కేవలం చల్లదనమే కాదు, భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఆరోగ్య ప్రయోజనాలతో కూడా ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం పదండి.
ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది
పెద్దలు, ఆయుర్వేదిక్ నిపుణుల ప్రకారం మట్కా లేదా మట్టి కుండ/మట్టి పాత్రలో నీరు నిల్వచేసి తాగడం ఆరోగ్యదాయకం. ఎందుకంటే ఇది సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మట్టికుండాలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియ (Evaporative cooling) నీటిని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. కుండలోని నీరు ఫ్రిజ్‌లోని ఐస్- కోల్డ్ లాగా జీర్ణ వ్యవస్థకు కూలింగ్ షాక్ ఇవ్వదు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది గొంతుకు, జీర్ణక్రియకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా మట్టి సహజంగానే ఆల్కలైన్ స్వభావం కలిగి ఉండటంవల్ల శరీరంలోని ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది. ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. మెటబాలిజం ప్రాసెస్‌ను మెరుగు పరుస్తుంది.
సురక్షితమైనది..
నీటిని మట్టి కుండలో స్టోర్ చేసినప్పుడు అది మట్టి నుంచి మెగ్నీషియం, కాల్షియం వంటి స్వల్ప ఖనిజాలను గ్రహిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ లేదా మెటల్ కంటైనర్లలో ఉండే బీపీఏ (BPA) వంటి హానికరమైన రసాయనాలు మట్టి పాత్రలలో ఉండవు. కాబట్టి పర్యావరణ అనుకూలమైదే కాకుండా సురక్షితమైనది కూడాను. మట్టి కుండలోని మట్టి ఉపరితలం (surface) ద్వారా నీటికి నేచురల్ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇది నీటికి రుచిని ఇస్తుంది. కాబట్టి కుండనీరు తాగడం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అయితే కుండనీరు నేరుగా కొలెస్ట్రాల్ లేదా రక్తపోటును నియంత్రించదు. కానీ మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. అందుకే ఆయుర్వేద సంప్రదాయాలలో మట్టికుండలోని నీటిని తాగడం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసేందుకు సహాయపడుతుందని సిఫార్సు చేయబడింది.






