నెగెటివ్ విషయాలే మనకు ఎక్కువగా గుర్తుండిపోతాయి..! ఎందుకలా..?

by Javid Pasha |

నెగెటివ్ విషయాలే మనకు ఎక్కువగా గుర్తుండిపోతాయి..! ఎందుకలా..?
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ మిమ్మల్ని పొగిడే వ్యక్తి ఏదో ఒక్క రోజు అనుకోకుండానో, ఆవేశంలోనో తిట్టారనుకోండి.. అన్ని రోజులూ పొగిడింది మర్చిపోయి, తిట్టిన విషయాన్ని మాత్రమే బాగా గుర్తు పెట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడల్లా దానిని ప్రస్తావిస్తుంటాం. ఇదొక్కటే కాదు, జీవితంలోని అనేక అనుభవాలు, సంఘటనల విషయంలో దాదాపు ఇలాగే చేస్తుంటాం. సానుకూల ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలకంటే కూడా, ప్రతికూల ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలను మాత్రమే మన మెదడు బాగా గుర్తుంచుకుంటుంది. అయితే అలా ఎందుకు జరుగుతుందో పరిశీలించిన ఒక అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేమిటో చూద్దా పదండి.

జర్నల్ ఆఫ్ కాగ్నెటివ్ న్యూరో సైన్స్ సహా పలు అధ్యయనాల ప్రకారం.. ప్రతికూల అనుభవాలు మెదడులోని అమిగ్డాలా, అలాగే ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థలను(Stress-response systems) యాక్టివేట్ చేస్తాయి. ఈ పరిస్థితి ఒక విధంగా మానవులకు మేలు చేస్తుందని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేవి భవిష్యత్తులో వివిధ ప్రమాదాల(threats) నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సమాచారాన్ని మెదడు లేదా జ్ఞాపక శక్తిలో నిక్షిప్తం చేస్తాయి. దీనినే నెగెటివిటీ బయాస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియవల్లే మనకు ప్రతికూల సంఘటనలు బలంగా గుర్తుండిపోతాయి. ఇవి మనిషి రక్షణ విధానంలో భాగంగా పనిచేస్తాయి. ఉదాహరణకు యాక్సిడెంట్, మెట్లపై నుంచి జారి పడటం వంటివి జరిగినప్పుడు వాటిని మనం ఎదుర్కొన్నప్పుడు ఈ అనుభవాలు మనసులో బలంగా నాటుకుపోతాయి. తద్వారా భవిష్యత్తులో జాగ్రత్త పడేలా చేస్తాయి.

అయితే నెగెటివిటీ బయాస్ వల్ల సానుకూల అనుభవాలు(పాజిటివిటీ బయాస్) కాస్త తక్కువ గుర్తుండిపోతాయి. ప్రతికూల భావనలు మరీ ఎక్కువైనా ప్రమాదమే. ఎందుకంటే సానుకూల సంఘటనలను, విషయాలను సైతం పట్టించుకోలేని పరిస్థితిలోకి మనం నెట్టివేయబడవచ్చు. అలా జరిగే సూచనలు కనిపిస్తే మాత్రం అలర్ట్ అవ్వాలంటన్నారు నిపుణులు. అందు కోసం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం, ప్రతి రోజూ సానుకూల అనుభవాలను రాయడం, గుర్తు చేసుకోవడం, పాజిటివ్ స్టేట్‌మెంట్స్‌తో స్వీయ - ప్రేరణ పొందడం, సానుకూల భావోద్వేగాలపై ఫోకస్ చేయడం వంటివి ప్రాక్టీస్ చేస్తే నెగెటివ్ అండ్ పాజిటివ్ బయాస్‌ల మధ్య సమతుల్యతను సాధించవచ్చు. Link

Next Story