- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : శరీరంలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఇది లోపించినట్టే!
నిజానికి విటమిన్ బి1 శరీరంలో నిల్వ ఉండే మోతాదే చాలా తక్కువ. కాబట్టి రోజువారీ ఆహారాల ద్వారా నిరంతరం తీసుకోకపోవడం వల్ల అది లోపిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఎప్పుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండే మీరు కొంతకాలం నుంచి డల్‌గా ఉంటున్నారా? అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ శరీరంలో థయామిన్ (విటమిన్B1) లోపించి ఉండవచ్చు. ఇది తీవ్రమైతే చేతులు-కాళ్లు తిమ్మిరి పట్టడం, నడవడంలో ఇబ్బంది, దృష్టి మందగించడం, నరాలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రాసెస్డ్ కార్బ్స్ ఎక్కువ తినేవాళ్లు, ఆల్కహాల్ వాడేవాళ్లు, డయాబెటిక్ పేషెంట్లు, వృద్ధులు, గర్భిణులు, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లల్లో ఇది లోపిస్తే ఆరోగ్యం మరింత రిస్క్‌లో పడుతుంది. ఇంతకీ ఇది ఎందుకు లోపిస్తుంది? లోపిస్తే ఏం జరుగుతుంది? దానివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు లోపిస్తుంది?
నిజానికి విటమిన్ బి1 శరీరంలో నిల్వ ఉండే మోతాదే చాలా తక్కువ. కాబట్టి రోజువారీ ఆహారాల ద్వారా నిరంతరం తీసుకోకపోవడం వల్ల శరీరంలో అది లోపిస్తుంది. దీంతోపాటు ప్రాసెస్డ్ & రిఫైన్డ్ ఆహారం, వైట్ రైస్, మైదా, జంక్ ఫుడ్, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో థయామిన్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఆహారం నుంచి తక్కువగా అందుతుంది కాబట్టి ఇలాంటప్పుడు లోపం ఏర్పడుతుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, పోషకాహార లోపం, క్రానిక్ డయేరియా, ఇరిటుబల్ బౌల్ సిండ్రోమ్, జీర్ణ సమస్యలు వంటివి ఉన్నా ఈ విటమిన్ లోపిస్తుంది. కీమోథెరపీ, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడటంవల్ల కూడా లోపించే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయం, బ్రెస్ట్ ఫీడింగ్, ఇన్ఫెక్షన్లు, శస్త్ర చికిత్సలు, ఎక్కువ వ్యాయామాలు చేయడం వంటి సందర్భాల్లో థయామిన్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు పోషకహారం సరిగ్గా తీసుకోకపోతే థయామిన్ లోపిస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో మెటబాలిజం మారడంవల్ల, వయసు పెరిగేకొద్దీ శోషణ తగ్గడంవల్ల కూడా లోపించే చాన్స్ ఎక్కువ.
ఏం చేయాలి?
సహజమైన ఆహారాల ద్వారానే ఈ లోపాన్ని అధిగమించవచ్చు. పుషులకు అయితే రోజుకు 1.2 మి.గ్రా. స్త్రీలకు అయితే 1.1 మి.గ్రా థయామిన్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు. అందుకోసం అన్ని రకాల పప్పులు, గింజలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. మాసం, సాల్మన్ చేపలు వంటి వాటిలోనూ లభిస్తుంది. బ్రౌన్ రైస్, వోట్స్, ఫోర్క్ మీట్ వంటి ఆహారాల ద్వారా కూడా విటమిన్ 1 ఎక్కువ లభిస్తుంది. అలాగే నట్స్ & సీడ్స్, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ సీడ్స్, వేరుశనగలు, ఆకు కూరలు, బంగాళ దుంపలు, టమాటోలు వంటి వాటిలోనూ లభిస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారాల్లో ఇవి ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు జీవన శైలిలో మార్పులు కూడా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక చక్కెరలు తగ్గించుకోవాలి. డయాబెటిస్ బాధితులు బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాయామాలు చేస్తే అందుకు తగినట్టుగా ఎక్కువ థయామిన్ లభించే ఆహారాలు తీసుకోవాలి.
థయామిన్ ప్రయోజనాలు
థయామిన్ (విటమిన్ బి1) కలిగి ఉండటంవల్ల కార్బో హైడ్రేట్లను శక్తిగా మార్చడంలో కీ రోల్ పోషిస్తుంది. శరీరానికి, మెదడుకు శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. నరాల పనితీరుకు సహాయపడుతుంది. నాడీ సంకేతాలను మెదడుకు సక్రమంగా పంపడంలో, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగు పరడానికి ఇది చాలా అవసరం. అలాగే మూడ్ స్థిరత్వం, చిరాకు తగ్గడం, డిప్రెషన్ లక్షణాల నుంచి బయటపడటానికి సహాయం చేస్తుంది. గుండె కండరాలకు శక్తిని అందించి, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి రాకుండా నివారిస్తుంది. కళ్లు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారాల ద్వారా థయామిన్ పొందడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






